సినిమా

Nana Patekar: "నట సామ్రాట్" కన్నుమూత..చిత్ర పరిశ్రమకి తీరని లోటు!

రచన: Anshu••6 నిమిషాల పఠనం

Nana Patekar: భారతీయ చిత్ర పరిశ్రమలో నటనతో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్ళు. ఈ అక్టోబర్ 8 (గురువారం) తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలా ప్రాంతంలోని తన నివాసంలో ఆయనకు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న నానాను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సిపీఅర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

Nana Patekar: భారతీయ చిత్ర పరిశ్రమలో నటనతో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్ళు. ఈ అక్టోబర్ 8 (గురువారం) తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలా ప్రాంతంలోని తన నివాసంలో ఆయనకు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న నానాను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సిపీఅర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆయనను రక్షించలేకపోయారు. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

నానా పటేకర్ గత కొన్నేళ్ళ నుంచి గోవాలోనే ఉంటున్నారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు అకస్మాత్తుగా తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తింది. ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడంతో వెంటనే వైద్య సిబ్బందిని కుటుంబ సభ్యులు సంప్రదించారు. అనంతరం ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు కంటిన్యూస్‌గా సీపీఅర్ చేసినప్పటికీ నా స్పందించలేదట. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక, ఈ సంఘటనపై మెడికో-లీగల్ కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు కూడా డాక్టర్లు వెల్లడించారు.

4 దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణం:

నానా పటేకర్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా, మరాఠీ, సినిమాల్లోనూ నటించారు. నాటరంగం నుంచి సినీ పరిశ్రమలోకి వచ్చారు. నానాలోని సహజమైన నటన, గంభీరమైన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా.. ఇలా విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా, ఆయన డైలాగ్ చెప్పే విధానం, ముఖ కవళికలు, పాత్రలో పూర్తిగా ఒదిగిపోయే విధానం నానా పటేకర్‌ను ఇతర నటుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టాయి. ముఖ్యంగా, హిందీలో ఆయన చేసిన సినిమాలు ఒకదశలో ఇతర నటులకు గట్టి పోటీనిచ్చాయి.

ఏ నటుడికైనా రిజక్షన్ తప్పదు:

నానా వాయిస్ బాగోలేదని ఆయన కెరీర్ ప్రారంభంలో కొందరు నెగిటివ్‌గా కామెంట్స్ చేశారు. కానూ, అదే వాయిస్‌కి ఫిదా అయి..ఇతర డబ్బింగ్ ఆర్టిసులతో కాకుండా ఆయన సొంత గొంతుతోనే తన పాత్రలకి గాత్రాన్ని అందించారు. వాస్తవానికి, నానా నటనకి వందల చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించే అవకాశాలు వచ్చాయి. కానీ, వచ్చిన ప్రతీ పాత్రను ఆయన ఒప్పుకోలేదు. అందుకే, 4 దశాబ్ధాలున్నప్పటికీ చాలా తక్కువ సినిమాలనే చేశారు.

Nana Patekar: "నట సామ్రాట్" కన్నుమూత..చిత్ర పరిశ్రమకి తీరని లోటు!

మరాఠిలో వచ్చిన నట సామ్రాట్:

స్వతాహాగా నాటరకంగం నుంచి వచ్చిన నానా..జీవితంలో చేసిన అద్భుతమైన సినిమా, పాత్ర నట సామ్రాట్. ఈ సినిమాలో నానా నటనకు ఎంత కఠినంగా ఉండే మనుషులైనా కన్నీళ్లు పెట్టాల్సిందే. ఈ సినిమాలో ఆయన పాత్ర..మేకోవర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఇదే, సినిమాను తెలుగులో కృష్ణవంశీ రంగమార్తాండ పేరుతో రీమేక్ చేశారు. కానీ, మరాఠిలో వచ్చిన నానా నట సామ్రాట్ కి వచ్చినంత పేరు ఈ సినిమాకి రాలేదనే చెప్పాలి. అలాగే, పరిందా’, ‘క్రాంతివీర్’ సినిమాలతోనూ నానా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.

Nana Patekar: "నట సామ్రాట్" కన్నుమూత..చిత్ర పరిశ్రమకి తీరని లోటు!

మీమ్స్ లో నానా క్రేజ్ నెక్స్ట్ లెవల్:

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మీమ్స్ పరంగా పాపులర్ అయింది అంటే జేడీ చక్రవర్తి, బ్రహ్మానందం. అలాగే, బాలీవుడ్‌లో మీమ్స్ ద్వారా బాగా పాపులర్ అయింది నానా పాటేకర్. ఆయన కాఫీ కప్పుతో నవ్వుతున్న వీడియోతో కొన్ని వేల మీమ్స్ తయారయ్యాయి. ఏదేమైనా నానా పాటేకర్ లేని లోటు చిత్ర పరిశ్రమకి తీరనిది. ఆయన మృతి పట్ల అన్నీ చిత్ర పరిశ్రమలోని సినీ ప్రముఖు సంతాపం తెలియజేస్తున్నారు.

#Nana Patekar#Nana Patekar Passes Away#Indian Actor Nana Patekar No More
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి