క్రైమ్

NarendraModiStadium: మ్యాచ్ జరుగుతుండగానే బాంబు బెదిరింపు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం భారత్ అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) అధికారిక ఈ-మెయిల్‌కు బెదిరింపు సందేశం వచ్చింది.

 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం భారత్ అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) అధికారిక ఈ-మెయిల్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు, బాంబ్ డిటెక్షన్, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో స్టేడియంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, ఇది కేవలం నకిలీ (ఫేక్) బెదిరింపు మాత్రమేనని తేల్చారు.

 నవంబర్ 21న నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రముఖ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ సంగీత కచేరీని లక్ష్యంగా చేసుకుని ఈ బెదిరింపునకు పాల్పడినట్లు సదరు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. తాము ఖలిస్థాన్ అనుకూల సంస్థకు చెందిన వారమని చెప్పుకుంటూ, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరగబోయే కచేరీని కూడా ప్రస్తావిస్తూ దిల్జిత్ ప్రోగ్రామ్‌లకు ఎవరూ హాజరుకావద్దని బెదిరించారు.

 ఉదయం 10:52 గంటలకు సమాచారం అందడంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. మ్యాచ్ ఉదయం 11:15 గంటలకు పూర్తయిన వెంటనే ఇరు జట్ల ఆటగాళ్లను సురక్షితంగా మైదానం నుంచి రిసార్ట్‌లకు తరలించారు. అనంతరం స్థానిక ఏసీపీ (సైబర్ క్రైమ్) హార్దిక్ మకాడియా మాట్లాడుతూ.. నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు మరో 13 కీలక పాఠశాలలు, విద్యాసంస్థలకు కూడా ఇలాంటి ఈ-మెయిల్స్ వచ్చాయని, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని స్పష్టం చేశారు.

 ఈ నకిలీ ఈ-మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న ముఠా ఎవరు అనే అంశంపై గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని పోలీసు యంత్రాంగం ప్రజలకు వెల్లడించింది.

 

#NarendraModiStadium#BombThreatAhmedabad#DiljitDosanjhConcert#IndiaVsAusU19#GujaratPolice#CyberCrime#KhalistanThreat
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి