సినిమా

Cinema: నిజంగా రివ్యూవర్స్ సినిమాను చంపేస్తున్నారా?

రచన: Anshu••7 నిమిషాల పఠనం

Cinema: మనకున్న అతిపెత్త వ్యాపారాలలో సినిమా అనేది కూడా ఎంతో ముఖ్యమైనది. కేవలం ప్రేక్షకులకి వినోదాన్ని పంచేదే కాకుండా, ఒక సినిమా ప్రకటించినప్పటి నుంచి నిర్మాణంలో ఉన్నన్ని రోజులు..ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్స్‌లో ప్రదర్శించే వరకు కొన్ని వందల కుటుంబాలు ఆధారపడుతున్నాయి.

Cinema: మనకున్న అతిపెత్త వ్యాపారాలలో సినిమా అనేది కూడా ఎంతో ముఖ్యమైనది. కేవలం ప్రేక్షకులకి వినోదాన్ని పంచేదే కాకుండా, ఒక సినిమా ప్రకటించినప్పటి నుంచి నిర్మాణంలో ఉన్నన్ని రోజులు..ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్స్‌లో ప్రదర్శించే వరకు కొన్ని వందల కుటుంబాలు ఆధారపడుతున్నాయి. ఇది, ప్రతి ఒక్కరు ఒప్పుకొని తీరాల్సిందే. వందల కోట్లు పెట్టే నిర్మాత..రాత్రింబవళ్ళు కష్టపడి..రీసెర్చ్ చేసి కథ తయారు చేసుకునే దర్శకరచయితలు. సినిమా కోసం ప్రాణం పెట్టే నటీనటులు..ఇతర సాంకేతిక నిపుణులు. ఇలా, ఒక్క సినిమా బయటకి రావడానికి వందలమంది శ్రమ ఉంటుంది.

కానీ, సినిమా షో చూసిన తర్వాత రివ్యూ రైటర్స్ ఇచ్చే రివ్యూల వల్ల కొన్ని సినిమాలు దారుణమైన నష్టాలను చూడాల్సి వస్తుంది. నెలల కొద్ది ఒక సినిమాను తయారు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే..ఒక్క రివ్యూతో సినిమాను చంపేస్తున్నారు. ఇది, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. దీనివల్ల ఒక నిర్మాత.. చిన్న సినిమా తీయాలన్నా భయపడి మనకెందుకులే.. అని వెనక్కి తగ్గుతున్నాడు. ప్రాడెక్ట్ తగ్గితే..సాధారణంగా పని తగ్గుతుంది..కుటుంబాలు రోడ్డున పడతాయి..పడుతున్నాయి.

రివ్యూ అనేది సొంత అభిప్రాయమే కదా:

సినిమా చూసిన తర్వాత ఒక రివ్యూ రైటర్ ఇచ్చేది 100కి 100 శాతం అతని సొంత అభిప్రాయమే. ఆ అభిప్రాయాన్ని అమ్ముకుంటున్నవాళ్ళు లేకపోలేదు. జేబులో జమైందా..సినిమా బావుందంటాడు..కాలేదా..బావున్న సినిమా కూడా పోయిందంటాడు. రివ్యూ రాసేవాళ్ళకి సినిమా చూసే వాళ్ళకి పొంతన అసలు ఉండదు. ఇది గమనించాల్సి ఉంది. నీకు నచ్చలేదు..ఇంకొకడికి నచ్చొచ్చు కదా. నువ్వెందుకు..నీ అభిప్రాయాన్ని పక్కవాడిమీద రుద్దాలి. ఇది, అడగాల్సిన ధర్మం అందరిదీ.

మొదటిరోజే రివ్యూ ఎందుకు చెప్పాలి..రాయాలి?

సినిమాకి అంతిమంగా తీర్పునిచ్చేది ప్రేక్షకులే. అభిమానులకి, ప్రేక్షకులకి నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే కిందపడేస్తారు. టికెట్ కొనుక్కొని సినిమా చూసిన ప్రేక్షకుడి అభిప్రాయం కూడా ముఖ్యం. కానీ, దాన్ని కూడా రివ్యూల పేరుతో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇప్పటికే, సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ బాగా తగ్గిపోయింది. క్వాలిటీ ఉన్న కథలు కరువయ్యాయి అన్న మాట ఎంత నిజమో..మంచి సినిమా రివ్యూవర్ల చేతిలో పడి పాడెక్కుతుందన్నది అంతే నిజం. అసలు, రివ్యూ రైటర్స్ అనే వాళ్ళు సినిమా చూసిన మొదటి రోజే ఎందుకు తమ అభిప్రాయాన్ని 'రివ్యూ' అని పేరు పెట్టి చెప్తున్నారు..రాస్తున్నారు. సినిమా చూడాలనుకున్న ప్రేక్షకుడు కూడా రివ్యూల మీద ఆధారపడి వెనక్కి తగ్గుతున్నారు.

Cinema: నిజంగా రివ్యూవర్స్ సినిమాను చంపేస్తున్నారా?

సినిమా బ్రతాకలంటే కనీసం 3 రోజుల వరకూ రివ్యూ రాయకూడదు:

కొత్తగా థియేటర్స్‌లోకి వచ్చిన సినిమా హిట్టో, ఫట్టో తెలియాలంటే కనీసం 3 రోజుల వరకూ ఆగాల్సిందే. శుక్రవారం రిలీజైన సినిమాను అందరూ చూడలేరు. వారాంతరంలో 60 నుంచి 70 శాతం ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుంది. మిగతా 30 నుంచి 40 శాతం అభిమానులే సినిమాను మోసేది. కాబట్టి, శుక్రవారం రిలీజైన సినిమాకి రివ్యూ రాయాలన్నా, చెప్పాలన్నా సోమవారం రోజే.. అని ఒక కఠిన నిబంధన పెడితే, అప్పుడు సక్సెస్ రేట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

సురేష్ బాబు కరెక్ట్:

టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాతలలో ఒకరైన డి.సురేష్ బాబు మొదటి మూడు రోజుల టాక్ ని పట్టించుకోరు. సోమవారం కూడా థియేటర్స్ హౌజ్ ఫుల్ అయితే అప్పుడు హిట్ సినిమా అని డిసైడ్ అవుతారు. అదే పద్ధతి ఉంటే బావుంటుంది. కానీ, రివ్యూ రైటర్స్ అత్యుత్సాహంతో ముందే సినిమా పోయిందని డిసైడ్ చేస్తున్నారు. మన సినిమాను మనమే చంపుకుంటున్నాం..అని ఓ సందర్భంలో ఎన్‌టిర్ బాధపడ్డారు కూడా. కానీ, రివ్యూ రాసేవాళ్ళకి అవన్నీ పట్టవు. ఇప్పుడు సినిమా ఫెయిల్ అవడానికి, కలెక్షన్స్ బాగా డ్రాపవడానికి కొందరు ఇచ్చే రివ్యూలే అసలు కారణం. ఇందులో, ఎలాంటి సందేహమూ లేదు. ఈ పద్ధతి మారాలంటే కనీసం 3 రోజుల పాటు ఎక్కడా ఎవరూ రివ్యూ రాయకూడదు..చెప్పకూడదు. ఇది ధర్మం. సినిమాను కాపాడుకునే బాధ్యత.

#Tollywood#Cinema#Reviews#Review Writers
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి