International

GoldPricetoday: పండుగల వేళ గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

రచన: Mamatha puppala••3 నిమిషాల పఠనం

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అక్టోబరు 8 ఉదయం ట్రేడింగ్ సమయానికి దేశీయ మార్కెట్‌లో 24క్యారెట్ల పసిడి (10 గ్రాములు) ధర రూ.1,49,270గా నమోదవగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,831గా కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే, కిలో వెండి రూ.2,23,600గా ఉండగా, 925 స్టెర్లింగ్ సిల్వర్ కిలో రూ.2,06,830 వద్ద ట్రేడైంది.

 అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ గణనీయంగా పెరగడం, గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడటమే అంతర్జాతీయంగా లోహాల ధరలు క్షీణించడానికి ప్రధాన కారణంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కామెక్స్‌ (COMEX) గోల్డ్ 0.18 శాతం తగ్గి ఔన్సుకు 4,133.2 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా, కామెక్స్ సిల్వర్ 0.48 శాతం తగ్గి ఔన్సుకు 60.005 డాలర్ల వద్ద కొనసాగింది. ఎంసీఎక్స్‌ (MCX) ఫ్యూచర్స్ మార్కెట్‌లో డిసెంబర్ గోల్డ్ కాంట్రాక్ట్ రూ.1.50 లక్షల దిగువకు పడిపోయి రూ.1,49,103 వద్ద ముగిసింది.

 దేశంలోని ప్రధాన నగరాల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.1,49,240, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,803, కిలో వెండి ధర రూ.2,23,550గా నమోదయ్యాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ దాదాపు ఇదే రీతిలో కొద్దిపాటి తగ్గుదలతో ధరలు నమోదయ్యాయి. పండుగల వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఈ స్వల్ప తగ్గుదల కొంత ఉపశమనం కలిగించే అంశంగా నిలిచింది. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా బులియన్ మార్కెట్ కదలికలు కొనసాగుతున్నాయి.

#GoldPriceDrop#Oct08GoldRates#TelanganaBullionMarket#HyderabadGoldPrice#SilverPriceUpdate#MCXGoldFutures#DollarIndexImpact
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి