టాప్ న్యూస్

Mallanna : తీన్మార్ మల్లన్న@ కారు కూతలు, రోత మాటలు..!

రచన: Kumar••6 నిమిషాల పఠనం

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. ఈ పేరు వింటే చాలు జర్నలిజం మాటున అధికార పార్టీ నేతలను ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, కారుకూతలు కూయడం కనిపిస్తుంటుంది. జర్నలిజం అనే ముసుగు కప్పుకుని తన పొలిటికల్ కెరీర్‌కు బాట వేసుకున్నాడని విమర్శలున్నాయి.

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. ఈ పేరు వింటే చాలు జర్నలిజం మాటున అధికార పార్టీ నేతలను ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, కారుకూతలు కూయడం కనిపిస్తుంటుంది. జర్నలిజం అనే ముసుగు కప్పుకుని తన పొలిటికల్ కెరీర్‌కు బాట వేసుకున్నాడని విమర్శలున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావును ఎక్కువగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆ తర్వాత కేసులు ఎదుర్కొవడం,పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాడు. చింతపండు నవీన్ అనే పేరు కంటే తీన్మార్ మల్లన్నగా ఫేమస్ అయ్యాడు. నాడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాయింట్ ఔట్ చేసి ప్రజల గొంతుకగా నిలిచాడు. అయితే, కాలక్రమేణా ఆయన వాయిస్ మారుతూ వచ్చింది. జర్నలిజం నుంచి పొలిటికల్ ఎజెండాతో ముందుకు నడిచాడు. పార్టీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు.

కూర్చున్న కొమ్మను నరుక్కుని..

2015లో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఓడిపోయాడు. ఆ తర్వాత 2021 డిసెంబర్ 7 – బీజేపీలో చేరారు. అందులో వర్కౌట్ కావడం లేదని జనరల్ ఎలక్షన్స్ ముందు 2023 నవంబర్ 8 – కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధికారంలోకి రాగానే 2024లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా గెలిచారు. అయితే, కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా.. తనకు పొలిటికల్ బిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి మీదనే విమర్శనాస్త్రాలు సంధించాడు.

దీంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద 2025లో కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యాడు.చేసిన తప్పును అంగీకరించని మల్లన్న.. తనను సస్పెండ్ చేయడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తముందని ఆరోపించారు. పార్టీలో రెడ్డి వర్గం వారిదే హవా నడుస్తోందని, బీసీలకు కాంగ్రెస్ లో అన్యాయం జరుగుతోందని కొత్త రాగం ఎంచుకున్నాడు. అనంతరం బీసీలకు రాజ్యాధికారం తెస్తానని పేర్కొంటూ 2025 సెప్టెంబర్ – ‘తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ ఏర్పాటు చేశాడు.

ప్రశ్నించే గొంతుక పేరిట బూతులు, వెర్రి కూతలు

అప్పుడప్పుడు తన యూట్యూబ్ చానెల్ ద్వారా అధికార, ప్రతిపక్ష లీడర్లను బూతులు తిట్టడం, కులం, మతం ప్రాతిపదికన నేతలను టార్గెట్ చేయడం మాత్రం అస్సలు మాననుకోలేదు. తనకు రాజ్యాంగం స్ఫూర్తి అంటూనే దానికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొన్నటివరకు రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసిన మల్లన్న.. రెడ్డిలు అయితే అంత అహంకారమా? బలుపా? లాంటి పదాలను కూడా వాడారు.

తాను రేవంత్‌ను మించిన అప్డేట్ వెర్షన్ అంటూ పిచ్చి కూతలు కూస్తుండటం జనాల్లోనూ ఆయనకు పరపతిని తగ్గిస్తూ వచ్చాయి.గతంలో గులాబీ బాస్‌కు మద్యం తాగిపించడమే గులాబీల నేతల పని అంటూ విమర్శలు చేశాడు. స్మశాన వాటికలు చూస్తే చచ్చిపోవాలని అనిపిస్తుందని వెర్రి వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? గతంలో రైతు బీమా కింద చనిపోయిన కుటుంబానికి రూ. 5 లక్షలు ఇచ్చారని,ఇప్పుడు మీరు చస్తే రూ.10 లక్షలు ఇస్తానని ఎద్దేవా చేయడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ పెట్టినంత ఈజీగా పార్టీ పెట్టి తిట్టొచ్చని నేర్పుతున్న మల్లన్న అందరికీ నేర్పిస్తున్నాడని కొందరు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే నేతలకు ఎంత రేటుకు అమ్ముడుపోతున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సంచలనం కోసం ఏదైనా మాట్లాడాతారా? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారా? ప్రజాప్రతినిధులకు భాష ప్రాధాన్యమని, హుందాగా ఉండాలని సీనియర్లు చెబుతుంటే చెవికెక్కడం లేదా? ఇదేం ‘నవీన’ రాజ్యాధికారం? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పగటి వేషగాళ్లలా కొందరు రాజకీయాల్లోకి వస్తున్నారు. అవినీతి, అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని జోరుగా చర్చ జరుగుతోంది.

#teenmaar mallana#politics#telangana#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి