వైరల్ న్యూస్

Viral : ఫ్యామిలీతో కలిసి ప్రముఖ యూట్యూబర్ మధుమిత పరార్..!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ప్రముఖ యూట్యూబర్ మధుమిత మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని నాగర్‌కోవిల్‌ సమీపంలోని తమ్మత్తుక్కోణంకు చెందిన ఆమె తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. భార్యభర్తలు ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు.

ప్రముఖ యూట్యూబర్ మధుమిత మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని నాగర్‌కోవిల్‌ సమీపంలోని తమ్మత్తుక్కోణంకు చెందిన ఆమె తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. భార్యభర్తలు ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మధుమిత తన భర్తతో కలిసి ఇన్ స్టా, యూట్యూబ్‌లో ఫన్ వీడియోలు, రీల్స్ వంటివి చేస్తూ పేరు సంపాదించుకుంది.వీరి ఖాతాలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, ఇటీవల హోం టూర్ చేసిన మధుమిత తన ఇంట్లో ఉన్న నగదును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

కట్టల కొద్ది డబ్బును బెడ్ మీద పరచడంతో పాటు తన కూతురి మీద చల్లుతూ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. అది కాస్త దొంగల కంట పడటంతో భార్యభర్తలు ఇంట్లో లేని సమయంలో దొంగలు పడ్డారు. రూ.కోటికిపైగా నగదు, పెద్దఎత్తున బంగారం ఎత్తుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు ఫైల్ చేసి వారు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇంటికి తాళం వేసి ఫ్యామిలీతో కలిసి యూట్యూబర్ మధుమిత పరార్ అయ్యినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త, పిల్లలతో కలిసి మధుమిత ఎందుకు పరార్ అయ్యిందని జోరుగా చర్చ నడుస్తోంది. దొంగతనం ఆమె ఇంట్లో జరగగా.. రూ. కోటి నగదు , 118 సవర్ల నగలు పోయినట్టు బాధిత కుటుంబం ఫిర్యాదులో పేర్కొంది. దొంగలను కనిపెట్టే పనిలో పోలీసులు నిమగ్నం అవ్వగా.. తన 5 సవర్ల బంగారు గొలుసుని మధుమిత దోచుకుందంటూ తిరునెల్వేలికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

దీంతో యూట్యూబర్ మధుమితపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి పోలీసుల దర్యాప్తునకు భయపడి ఫ్యామిలీతో కలిసి మధుమిత ఎక్కడికో వెళ్లినట్టు తెలిసింది. ఫోన్స్ కూడా స్విచ్ఛాప్ చేసినట్టు సమాచారం. పోలీసులు ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటం గమనించినట్టు తెలుస్తోంది. ఆమె ఫోన్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.కాగా, ఆమె ఇంట్లోని బంగారం కూడా నిజంగానే దొంగలు ఎత్తుకెళ్లారా? భార్యభర్తలు ఆడిన గేమ్ ప్లానా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

#youtuber madhumita#tamilnadu#abscond#crime#robbery#viralnews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి