Mahesh-Lokesh: సూపర్‌స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్క్జెట్ సినిమా కి సన్నాహాలు చేతున్నారంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్‌పై టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ఇంతకీ, మహేష్–లోకేష్ సినిమా నిజంగానే ఉంటుందా? దీనిపై, క్లారిటీ రావాలంటే వారణాసి సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు ఇటీవల వెల్లడించారు. మహేష్ కి సంబందించిన షూట్ మొత్తం పూర్తి కావడంతో, ఆయన ఫ్యామిలీతో వెకెషన్‌కి వెళ్ళారు.
ఇక, మరోవైపు మహేష్ తన నెక్స్ట్ సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం పలువురు స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ, సుకుమార్, ప్రశాంత్ నీల్..ఇలా ఏకంగా పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్స్ మహేష్ కోసం కథ సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే, తాజాగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు వైరల్ అవుతోంది.
తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నదాని ప్రకారం లోకేష్ కనగరాజ్.. మహేష్ బాబుకు ఒక పవర్ ఫుల్ యాక్షన్ కథను వినిపించనున్నట్టు సమాచారం. అయితే, ఆల్రెడీ లోకేష్–అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ కెరీర్‌లో రూపొందనున్న 23వ సినిమా. ఇలా, లోకేష్ ఆల్రెడీ బన్నీ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయినా కూడా మహేష్-లోకేష్ కాంబోపై న్యూస్ రావడం ఆసక్తికరంగా మారింది. మరి, దీనిపై అటు మహేష్ గానీ, ఇటు లోకేష్ గానీ స్పందించి అసలు మ్యాటర్ చెప్తే ఫ్యాన్స్‌కి క్లారిటీ వస్తుంది.


