Kamal Hassan: దర్శకుడు శంకర్ రూపొందించిన సినిమాలలో ఖచ్చితంగా భారతీయుడు సినిమాకి సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ, ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ మాత్రం ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా నిరాశపరిచింది. ఇండియన్ 2మీద అటు తమిళంలో ఇటు తెలుగులో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, శంకర్ ఆ అంచనాలను 10 శాతం కూడా అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన గేమ్మ్ ఛేంజర్ మరో భారీ డిజాస్టర్. ఇలాంటి, సమయంలో మళ్ళీ ఇండియన్ 3 అప్‌డేట్ రావడం ఒకింత షాక్ ఇచ్చే విషయం.
ఇండియన్ 2 లాంటి భారీ డిజాస్టర్ తర్వాత శంకర్ నుంచి మళ్ళీ ఈ సినిమాకి కొనసాగింపుగా ఇండియన్ 3 వస్తుందని ఏ ఒక్కరూ ఊహించరు. కానీ, గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలే నిజమయ్యాయి. తాజాగా, మేకర్స్ భారతీయుడు 3 నుంచి అప్‌డేట్ ఇస్తూ ఓ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ వదిలిన తర్వాత పాజిటివ్ టాక్ కంటే కూడా నెగిటివ్ టాక్ బాగా వినిపిస్తోంది.
తాజాగా, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన అప్‌డేట్‌తో ఈ సినిమాపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి.‘భారతీయుడు 3’ షూటింగ్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే పూర్తయినప్పటికీ, మిగిలిన ప్యాచ్ వర్క్, వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల విషయంలో ఇన్ని రోజుల నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. ఇలా ఆలస్యం జరగడంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ లేదనుకున్నారు. కానీ, సెప్టెంబర్‌లోనే ఈ సినిమా పనులను తిరిగి ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.
కాగా, లైకా ప్రొడక్షన్స్ ‘ఇండియన్ 3’ పేరుతో సేనాపతి తిరిగి వస్తున్నాడంటూ.. కొత్త పోస్టర్‌తో అప్‌డేట్ ఇచ్చింది. “సేనాపతి ఈజ్ బ్యాక్” అనే కాన్సెప్ట్‌తో చేసిన లేటెస్ట్ పోస్టర్ అభిమానుల్లో భాగానే ఆసక్తిని పెంచుతోంది. చిత్ర బృందం నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ లో సినిమా క్యాన్సిల్ కాలేదన్న విషయం స్పష్టమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ ఎప్పుడు చేస్తారూ అనేది క్లారిటి ఇవ్వలేదు. రిలీజ్ డేట్‌ను ఎప్పుడు ప్రకటిస్తారో అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. శంకర్ సినిమా అంటే వీఎఫెక్స్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఎటూ ఇంకా టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉంది..అలాగే, గ్రాఫిక్స్, వీఎఫెక్స్ వర్క్ చేయాల్సి ఉంది. కాబట్టి, 2027లోనే భారతీయుడు వచ్చే అవకాశం ఉంది. చూడాలి, మరి ఈసారి కమల్-శంకర్ హిట్ కొడతారా లేదా!


