తెలంగాణ

అబ్బో సీతాఫలం.. మార్కెట్లో డజన్ కాయల రేటు చూస్తే మైండ్ బ్లాకే!

రచన: Mamatha puppala•••4 నిమిషాల పఠనం

ఎల్‌నినో (El Nino) ప్రభావం అన్ని ఆహారపదార్థాలపై పడుతోంది. ఇప్పటికే నీళ్లు లేక రైతులు పంటలు సాగుచేయడం కష్టతరంగా మారింది. ఉద్యాన పంటలకు సైతం ఈ ప్రభావం పడుతోంది. ఎన్నో పోషకాలు ఉండే సీజనల్ పండు సీతాఫలం ధరలు ఇప్పుడు అందనంత ఎత్తుకెళ్తున్నాయి. దిగుబడి భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

 ఎల్‌నినో (El Nino) ప్రభావం అన్ని ఆహారపదార్థాలపై పడుతోంది. ఇప్పటికే నీళ్లు లేక రైతులు పంటలు సాగుచేయడం కష్టతరంగా మారింది. ఉద్యాన పంటలకు సైతం ఈ ప్రభావం పడుతోంది. ఎన్నో పోషకాలు ఉండే సీజనల్ పండు సీతాఫలం ధరలు ఇప్పుడు అందనంత ఎత్తుకెళ్తున్నాయి. దిగుబడి భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

 గతంలో డజన్ సీతాఫలాలు రూ.150 నుంచి రూ. 200 వరకు లభించగా, ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కాయల డజన్ ధర ఏకంగా రూ.400 నుంచి రూ.500వరకు పలుకుతోంది. తమ 15ఏళ్ల వ్యాపార అనుభవంలో ఇంత ఘోరమైన ధరలను ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. పెరిగిన ధరల భారంతో వినియోగదారులు సీతాఫలాలు కొనడానికి వెనకాడుతుండటంతో వ్యాపారాలు మందగించి రిటైల్ వర్తకులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సహా పలు ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురవకపోవడం, తీవ్రమైన ఎండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత, పింద దశలోనే పంట దెబ్బతిన్నది. గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ చూడని రీతిలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఈసారి తోటల్లో కాయల ఉత్పత్తి గణనీయంగా క్షీణించిందని అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పంట దిగుబడి పడిపోయినప్పటికీ, తోటల సంరక్షణ, కూలీలు, ఎరువులు, నీటి పారుదల కోసం రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగాయి. ఆశించిన స్థాయిలో కాయలు కాయకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడంతో మార్కెట్లకు సరుకు రాక కొరత ఏర్పడటమే కాకుండా, ఫలితంగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో సీతాఫలం ధరలు అనూహ్యంగా పెరిగాయి.

 వాతావరణ మార్పుల కారణంగా అటు పంట పండించిన రైతు, ఇటు కొనుగోలు చేసే సామాన్య వినియోగదారుడు ఇద్దరూ తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టపోయిన సీతాఫలం సాగుదారులను ఆదుకోవడానికి ప్రభుత్వం తగిన పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీలను అందించి సహాయపడాలని వ్యవసాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

#CustardApplePriceHike#ElNinoImpact#AndhraPradeshAgriculture#EastGodavari#CropDamage#FruitPrices#APNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి