ఏపీ

‘తీర్థాన్ని స్వీకరించకుండా నటన’.. వైఎస్ భారతిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు ఆలయాలకు వెళ్లినప్పుడు అర్చకులు ఇచ్చే తీర్థాన్ని స్వీకరించకుండా, తాగినట్లు నటిస్తూ వేళ్ల సందుల్లోంచి కిందకు వదిలేస్తారని, ఇదేనా వారు పాటించే సెక్యులరిజం అని ఎద్దేవా చేశారు. తాను స్వచ్ఛమైన హిందువునని, అన్ని మతాల ప్రార్థనా స్థలాలను గౌరవిస్తానని తిరుపతిలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

 ఈ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కులాలు, మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఏకం చేసే లక్ష్యంతో ఈ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్ష వైసీపీల తర్వాత ఏపీ రాజకీయంలో తమ పార్టీయే మూడో ప్రధాన రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

 తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందిస్తూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీ, నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని విజయసాయిరెడ్డి సంచలన రీతిలో అంగీకరించారు. అయితే, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలసిందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో కిలో నెయ్యిని రూ. 320-400 మధ్య కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రూ. 658కి కొనుగోలు చేస్తోందని చెప్పారు. మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధర రూ. 1,000 పైనే ఉందని పేర్కొంటూ నాణ్యతా ప్రమాణాలను ప్రశ్నించారు.

 అదేవిధంగా కడప జిల్లాలోని కొన్ని ఆలయాల్లోకి ఇప్పటికీ దళితులకు ప్రవేశం కల్పించడం లేదని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అలాంటి సామాజిక వివక్షను సహించేది లేదని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలతో పాటు జైలు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

#VijayasaiReddy#YSBharathi#APPolitics#NewPoliticalPartyAP#TirumalaLadduControversy#YSRCP#AndhraNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి