తెలంగాణ

నీళ్లు అడిగిన రైతులపై కేసులా? రేవంత్ సర్కార్‌పై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

రచన: NK•••5 నిమిషాల పఠనం

జూరాల రైతులపై కేసుల నమోదు వ్యవహారం దుమారం రేపుతోంది. రేవంత్ సర్కార్ తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎండిపోతున్న పంట పొలాలను కాపాడుకోవడం కోసం నీళ్లు అడిగిన రైతులపై కేసులు నమోదు చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Jurala Farmers: జూరాల రైతులపై కేసుల నమోదు వ్యవహారం దుమారం రేపుతోంది. రేవంత్ సర్కార్ తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎండిపోతున్న పంట పొలాలను కాపాడుకోవడం కోసం నీళ్లు అడిగిన రైతులపై కేసులు నమోదు చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది

పొలాలు ఎండుతున్నాయని జూరాల గేట్లు తెరిచి నీటిని వదిలిన రైతులపై గుట్టుచప్పుడు కాకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. 14మంది రైతుల మీద నమోదైన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కరెంట్ బిల్లులు కట్టలేదని ఒక్క గట్టు మండలంలోనే రైతుల మీద 3 వేల కేసులు నమోదు చేశారు.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.

పాలమూరుకు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మరణశాసనం

పాలమూరుకు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ మరణశాసనం అంటూ ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ భవిష్యత్తు దెబ్బతీస్తున్నాయని విరుచుకుపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపడం కుట్ర అని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కారు కుట్రలు చేస్తోందన్నారు.

స్వయంగా గేట్లు ఎత్తి నీటి విడుదల

ఇటీవల ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొందరు రైతులు అధికారుల ప్రమేయం లేకుండానే నీటిని దిగువకు వదిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్ట్ ఎడమ కాలువ పరిధిలోని రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.

14మంది రైతులపై కేసులు

సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని సెప్టెంబర్ 19న జూరాల ప్రాజెక్ట్ మీదకు చేరుకుని రైతులు ఆందోళన చేపట్టారు. తమ పంటలను కాపాడుకునేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో అదేరోజు సాయంత్రం కొందరు రైతులు జూరాల ప్రాజెక్ట్ ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని స్వయంగా విడుదల చేసుకున్నారు. దీనిపై ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకున్న 14మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

#Jurala Farmers#Cases#Niranjan Reddy#Cm Revanth Reddy#Telangana#Swechaa News#Jurala Canal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి