Tollywood-Cinema: మన అగ్ర దర్శకులే ఇతర భాషలలో హిట్ అయిన సినిమా కథ లైన్ పట్టుకొని ఇక్కడ హీరోలకి తగ్గట్టుగా కథను చుట్టేస్తున్నారు. కాబట్టే, ప్రతీసారి కాపీ కథ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు, ఒక భాషలో హిట్ అయిన సినిమాను కథ కొనుక్కొని ఇక్కడ హీరోల ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేసి రీమేక్ చేసేవారు. కానీ, ఇప్పుడు కొరియన్ భాషలో హిట్ అయిన సినిమాలను ఇక్కడ ఈజీగా దింపేస్తున్నారు.
అప్పట్లో, సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా కథ కొరియన్ లో వచ్చిన 'మిస్ గ్రానీ' సినిమా ఆధారంగా తీసుకున్నదే. పూరి జగన్నాధ్ బ్లాక్ బస్టర్ కొట్టిన 'ఇస్మార్ట్ శంకర్' కూడా 2017లో వచ్చిన 'ఐబాయ్' సినిమా కథ ఆధారంగా వచ్చిందే. ఇలా, ఎన్నో సినిమాలు అరువు కథలతో సినిమాను తీస్తున్నారు. సొంతగా కథ రాయడం కంటే ఇతర భాషలో హిట్ అయిన సినిమా పాయింట్ ను తీసుకొని ఇక్కడ రీజనల్ కథగా చూపిస్తున్నారు. ఇటీవల వచ్చిన 'బ్లాస్ట్' సినిమా కూడా 2013లో వచ్చిన 'ది టెర్రర్ లైవ్' అనే కొరియన్ సినిమా ఆధారంగా వచ్చింది. అంతేకాదు, 'మా ఇంటి బంగారం'..'కాకా' చిత్రాలు కూడా ఇదే పాయింట్‌తో తెరకెక్కుతున్నాయట.
రాజమౌళి కూడా ఆయన రూపొందించిన చాలా సినిమాలలో హాలీవుడ్ మూవీస్‌లోని సీన్స్‌ను కాపీ కొట్టాడనే మాట బాగా వినిపిస్తుంది. '300', 'ది వారియర్' లాంటి చాలా సినిమాల నుంచి స్పూర్తి పొంది 'బాహుబలి' సినిమాలో కొన్ని సీన్స్ ని తెరకెక్కించాడు. అలాగే, మిగతా కొన్ని సినిమాలలో కూడా జక్కన్న ఇలా హాలీవుడ్ సీన్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు, హిట్ మెషిన్‌గా పేరు తెచ్చుకొని వరుస హిట్స్ కొడుతున్న అనిల్ రావిపూడి కూడా తన కథల్లో జంధ్యాల, ఈవీవీ సినిమా ప్రభావం కనిపిస్తోంది.
ఇక, మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చాలా సినిమాల కథలను పాత సినిమాల నుంచో..ఇతర భాషల నుంచో ఆధారం చేసుకొని తీస్తున్నాడు. అందుకే, గురూజీని కాపీ మాస్టర్ అని కూడా కామెంట్స్ చేస్తున్నాడు. అప్పట్లో వచ్చిన 'ఇంటిగుట్టు' సినిమానే అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురములో'.. సినిమాను తీశాడు. 'అ.ఆ' కూడా విజయ నిర్మల తీసిన హిట్ సినిమా మీనా ఆధారంగా తీసినదే. దీన్ని, బట్టి చూస్తే..అసలు సొంత కథ రాసి సినిమా తీస్తున్న దర్శకులెంతమంది..! అని సందేహాలు కలగక మానవు.












