తెలంగాణ

Jurala Water: ఎండిపోతున్న పంటలు, ఏమార్చుతున్న హామీలు.. ప్రభుత్వం ఇచ్చిన 3 టీఎంసీల హామీ ఏమైంది?

రచన: NK•••3 నిమిషాల పఠనం

కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కొరతతో భూములు నెర్రలువారుతుండగా, పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎండిపోతున్న పంటలు

జూరాల ఆయకట్టు రైతుల్లో ఆందోళన

ప్రభుత్వం ఇచ్చిన 3 టీఎంసీల హామీ ఏమైంది?

పంటలు ఎండుతున్నా రైతాంగాన్ని ఓదార్చని అధికార, ప్రతిపక్ష నాయకత్వం

Jurala Water: కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కొరతతో భూములు నెర్రలువారుతుండగా, పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సాగునీటిని విడుదల చేయాలంటూ గత నెలలో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో కర్ణాటక జలాశయాల నుంచి 3 టీఎంసీల నీటిని తెప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, పది రోజులు గడిచినా ఇప్పటివరకు నీరు ఎందుకు విడుదల కాలేదన్న ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ ప్రకారం నీటిని తీసుకురావడంలో జాప్యానికి కారణమేంటి? కర్ణాటకతో జరిగిన చర్చలు ఏ మేరకు ఫలించాయి? నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

మరోవైపు పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నాయకులు రైతుల సమస్యలపై మరింత దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

ఇప్పటికే సాగునీటి కొరతతో పంటలు దెబ్బతింటున్న నేపథ్యంలో, రానున్న ఎండా కాలంలో తాగునీటి సమస్య కూడా తీవ్రమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పంటలకు నీరు ఎప్పుడు? 3 టీఎంసీల హామీ ఎప్పుడు అమలు చేస్తారు? రైతులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

#Jurala Water#Cm Revanth Reddy#Irrigation Water#Karnataka#3 Tmc#Jurala Farmers#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి