తెలంగాణ

Lift: షాపింగ్ మాల్‌లో షాకింగ్ ఘటన.. లిఫ్ట్‌‌లో ఇరుక్కుపోయిన చిన్నారులు.. గంటపాటు నరకయాతన

రచన: NK•••3 నిమిషాల పఠనం

వికారాబాద్‌లోని లక్కీ కిడ్స్ షాపింగ్ మాల్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పవర్ కట్‌తో మాల్ లోని లిఫ్ట్‌ అమాంతం ఆగిపోయింది. ఆ సమయంలో దుస్తులు కొనేందుకు మాల్ కి వెళ్లిన కొందరు కస్టమర్లు లిఫ్ట్ లో ఉన్నారు. మహిళలు, చిన్నారులు లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు వారంతా లోపలే ఉండిపోయారు.

Lift: వికారాబాద్‌లోని లక్కీ కిడ్స్ షాపింగ్ మాల్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పవర్ కట్‌తో మాల్ లోని లిఫ్ట్‌ అమాంతం ఆగిపోయింది. ఆ సమయంలో దుస్తులు కొనేందుకు మాల్ కి వెళ్లిన కొందరు కస్టమర్లు లిఫ్ట్ లో ఉన్నారు. మహిళలు, చిన్నారులు లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. సుమారు గంట పాటు వారంతా లోపలే ఉండిపోయారు. లిఫ్ట్ నుంచి బయటకు రాలేక, లోపల గాలి ఆడక మహిళలు, చిన్నారులు నరకయాతన అనుభవించారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు.

లిఫ్ట్ పైకప్పు తొలగించి బయటకు

చివరికి లిఫ్ట్ పైకప్పును తొలగించి అందులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. లిఫ్ట్ లో చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, షాపు యజమాన్యం తీరుపై బాధితులు తీవ్రంగా మండిపడ్డారు. లిఫ్ట్ లో చిక్కుకుపోయిన తమను కాపాడేందుకు యాజమాన్యం కనీసం ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాపు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

ప్రారంభంలోనే ప్రమాదం..

వికారాబాద్ జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితమే ఈ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. వికారాబాద్ మేరీనాట్ చౌరస్తాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు అనన్య చేతుల మీదుగా ప్రారంభమైంది ఈ లక్కీ కిడ్స్ షోరూమ్. ప్రారంభ దశలోనే ఇలాంటి ప్రమాదం జరగడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఆ ఘటన యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుంది. దీన్ని తేలిగ్గా తీసుకోరాదని, నిర్లక్ష్యంగా వ్యవహరించి కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం ఆడిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, వారి కుటుంబసభ్యులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

#Lift#Shopping Mall#Vikarabad#Lucky Kids Shopping Mall#Struck#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి