తెలంగాణ

Jagtial: ఒక్కో గదిలో 10మంది అమ్మాయిలు, రేకుల షెడ్డులోనే క్లాసులు.. జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దారుణ పరిస్థితులు

రచన: NK••5 నిమిషాల పఠనం

జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. కనీస వసతులు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. నాలుగేళ్లు అవుతున్నా.. ఇంకా రేకుల షెడ్డులోనే క్లాసులు జరుగుతున్నాయని, హాస్టల్ లో వసతులు సరిగా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్, కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనుల్లో పురోగతి లేదని తెలిపారు.

Jagtial: రేకుల షెడ్డులోనే క్లాసులు, ఒక్కో రూమ్ లో 10మంది అమ్మాయిలు, కామన్ వాష్ రూమ్స్.. చదువుకోవడానికి లైబ్రరీ లేదు, రవాణ సౌకర్యం లేదు, మెస్ కూడా లేదు.. ఇదీ జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులు. కనీస వసతులు కూడా విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్లు కావొస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

కనీస వసతులు కరవు..

జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. కనీస వసతులు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. నాలుగేళ్లు అవుతున్నా.. ఇంకా రేకుల షెడ్డులోనే క్లాసులు జరుగుతున్నాయని, హాస్టల్ లో వసతులు సరిగా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్, కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనుల్లో పురోగతి లేదని తెలిపారు.

నాలుగేళ్లుగా సమస్యలతో సతమతం

మెడికల్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడం దారుణం అన్నారు. సరైన మెస్, వాష్ రూమ్ సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నాలుగేళ్లు వేచి చూశామని, ఇక ఓపిక నశించిందన్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

కనీస వసతులు కల్పించాలని డిమాండ్

''మాకు కాలేజీ క్యాంపస్ కావాలి. అక్టోబర్ లోపు హాస్టల్స్ కావాలి. రవాణ సౌకర్యం కల్పించాలి. మెస్ కావాలి. కనీస వసతులు కల్పించాలి. మాకు కనీసం చదువుకోవడానికి లైబ్రరీ కూడా లేదు. గర్ల్స్ హాస్టల్ లో అయితే మరీ దారుణం. ఒక్కో రూమ్ లో 10 మంది ఉంటున్నాము. అందరికీ కామన్ వాష్ రూమ్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్ లో 100 మంది ఉంటారు. అంతమందికి ఆ వాష్ రూమ్స్ సరిపోవు. ఇప్పటికే మేము 600 మంది ఉన్నాము. దసరా తర్వాత మరో 150మంది జాయిన్ అవుతారు. మాకే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక కొత్తగా వచ్చే వాళ్ల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. నాలుగేళ్లు అయిపోయాయి. అందరినీ కలిశాము. కానీ మా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. అందరూ మాకు అబద్దపు హామీలే ఇచ్చారు'' అని విద్యార్థులు వాపోయారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి

''మాకు మా హాస్టల్స్, మా కాలేజీ బిల్డింగ్ లు కావాలి. ఇప్పటికి 20సార్లు మాకు మాట ఇచ్చి తప్పారు. మాకు కావాల్సింది కనీస వసతులు. 2022లో మాతో పాటు అన్ని కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే నాలుగు బ్యాచులు వచ్చాయి. ఫ్రెష్ గా మరో బ్యాచ్ వస్తుంది. ఇప్పుడున్న త్రీ ఫ్లోర్స్ హాస్టల్స్ లోనే దాదాపు 400మంది కుక్కారు. ఇప్పుడు మరో 100మంది కొత్తగా వస్తారు. వారిని ఎక్కడ పెడతారు? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలి'' అని విద్యార్థులు డిమాండ్ చేశారు.

#Jagtial#Jagtial Government Medical College#Students#Protest#Medical College Building#Hostels#Swechaa News#Better Facilities
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి