తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు 10వ తేదీ నుంచే దసరా సెలవులు

రచన: NK•••3 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 10వ తేదీ నుండి 22 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

Dasara Holidays: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ నెల 10వ తేదీ నుంచే

హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. 13 రోజుల పాటు పండుగ సెలవులు ఉండనున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 10వ తేదీ నుండి 22 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 23న స్కూల్స్ పున:ప్రారంభమవుతాయి. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10వ తేదీ నుండి 21 వరకు సెలవులు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వారాంతపు సెలవులతో కలిపి అక్టోబర్ 10 నుండి 21 వరకు పాఠశాలలకు దసరాల సెలవులు వర్తిస్తాయి. అక్టోబర్ 22న స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ సహా అన్ని రకాల విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి.

దసరా సెలవుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రకటించిన ఫెస్టివల్ హాలిడేస్ షెడ్యూల్‌ను విద్యా సంస్థలన్నీ విధిగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. దసరా సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాఠశాలల్లో ప్రస్తుతం సమ్మేటివ్ అసెస్ మెంట్-1 (SA-1) పరీక్షలు జరుగుతున్నాయి. అక్టోబర్ 9వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు (అక్టోబర్ 10) నుంచే విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభమవుతాయి. పండుగ సెలవుల అనంతరం స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి.

#Dasara Holidays#Schools#Andhra Pradesh#Telangana#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి