దేశంలో ఏ చిన్న అంశం దొరికినా విపక్షాలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినంతగా ఆనందపడతాయి. ఆ వెంటనే నిరసనలు, ధర్నాలు, వీధి పోరాటాలు ఊపందుకుంటాయి. అయితే, ఈ ఆందోళనలు నిజంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనా? లేక వ్యవస్థల్లో కల్లోలం సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు జరుగుతున్న వ్యూహాత్మక ప్రయత్నమా? అనేది అర్థం అయ్యేలోపే జరగవలసిన నష్టాలు జరిగిపోతున్నాయి..
ఇక ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణపై విడుదల చేసిన గణాంకాలు, దానికి ప్రతిపక్షాలు చూపిస్తున్న నిరసన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 13 కోట్ల 39 లక్షల ఓట్లను తొలగించింది. ఇందులో మరణించిన వారివి 2 కోట్ల 80 లక్షలు కాగా, రెండు చోట్ల ఉన్న నకిలీ ఓట్లు కోటి రెండు లక్షలు.
ఇక 6 కోట్ల 30 లక్షల మంది శాశ్వతంగా స్థానం మారగా, 3 కోట్ల లక్ష మంది ఇచ్చిన చిరునామాలో లేరు. మరో 26 లక్షల ఓట్లను ఇతర సాంకేతిక కారణాలతో తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.. అయితే వీటన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ పక్కా ఆధారాలు చూపిస్తున్నప్పటికి విపక్షాలు మాత్రం ఏ ఒక్క నిరూపణా లేకుండా 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారంటూ వీధుల్లో ఆందోళనలకు దిగడం వెనుక ఉన్న కారణం ఏంటనేది అర్థం కానీ ప్రశ్నలా మిగిలిందనే సందేహాలు తలెత్తుతున్నాయి..
అయితే విపక్షాల ప్రతినిధి యోగేంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. నిర్ణయాలు ఇకపై పార్లమెంట్‌లోనో, కోర్టుల్లోనో జరగవు.. వీధుల్లోనే జరుగుతాయని చెప్పడం వెనుక ఈ పోరాటాల అంతరార్థాన్ని స్పష్టం చేస్తున్నాయనే చర్చలు మొదలైయ్యాయి.. గతంలో నీట్ నిరసన ఉద్యమం పేరుతో ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని కొన్ని బొద్దింకలను అడ్డం పెట్టుకొని నానా హంగామా చేసినారు..
ఆ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సైతం చేశారు. అయితే ఆయన రాజీనామా చేయడంతో నీట్ పరీక్షా విధానం, విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు వచ్చాయా? ఇంతకీ ఆయన రాజీనామా కోరడానికి వెనుక ప్రయోజనం ఏమిటి? అనేది ఇప్పటికీ తేలలేదు.. యిందంతా పక్కన పెడితే ఆయన రాజీనామా చేయగానే.. నీట్ విషయం అటకెక్కింది. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఏమయ్యాయో తెలియదు.. ఇక నీట్ లీకేజీ కథ ఎవ్వరికీ అక్కరలేకుండా పోయింది.
ఈ తతంగం అంతా గమనిస్తున్న ప్రజలకు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. అప్పటిదాకా ఊపిరాడకుండా ఉన్న విపక్షాలకు, వామపక్షవాదులకు, లిబరలిస్టులకు, స్పాన్సర్డ్ ఉద్యమాల కోసం అర్రులు చాచుకుంటూ ఉన్న వారు ఒక్క సారిగా ఎందుకు రిలాక్స్ అయ్యారో అర్థం కాకుండా పోయిందని చర్చించుకుంటున్నారు.. ఇంతలోనే ఉన్నట్టుండి ఐఐటీ బాంబే ఇష్యూ తెరపైకి వచ్చింది.
కొద్ది రోజులు ఆ అంశాన్ని పట్టుకుని ఊగుదామనుకున్నారు కానీ.. అది కాస్తా రివర్స్ అయ్యి తమకే తగిలేటట్టుండటంతో గప్ చుప్ అయిపోయారు. మరి దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు కదా.. ఏమైందీ పోరాటం.. ? అదే ఊళ్లో పక్కనే ఉన్న కాక్రోచ్ కు కూడా పట్టలేదు. ఇంత వివక్ష ఎందుకనే ఆలోచనలు జనంలో మొదలైయ్యాయి.. కానీ ఆ వెంటనే పంజాబ్ లోని రెండు యూనివర్సిటీల్లో అల్లర్లు మొదలైయ్యాయి.
విధ్వంసం కూడా జరిగింది. కానీ అక్కడ ఉన్నది ఆప్ సర్కారు కదా.. సహజంగానే ఏ బొద్దింకా.. ఏ విపక్షమూ, ఏ కమ్యూనిస్టూ.. ఆ విషయం పై గప్ చుప్ అయ్యారు.. ఒక్కరు కూడా నోరెత్తలేదు. అప్పటికే బుర్ర వేడెక్కి ఉన్న విపక్షాలకు ఎస్ఐఆర్ దొరికేసింది. ఇంకేం పోతురాజులు తయారైపోయారు. ఇప్పటికి 19 సార్లు జరిగిన ఎస్ఐఆర్ ఇప్పుడు మాత్రం బ్యాడ్ అవడం విడ్డూరంగా మారింది.
ఇక ఇలాంటి అంశాల్లో విపక్షాల ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడింది. తమకు అనుకూలమైన చోట మౌనం వహించడం, మిగిలిన చోట్ల ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఆరోపణలు చేయడం వారికి పరిపాటిగా మారిందనే అభిప్రాయాలు జనం నుండి వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ నిరంతర ఆందోళనల వెనుక మా బాబునే ప్రధానిని చేయాలనే సంకల్పం ఉందనడానికి 7 ప్రధాన వ్యూహాలు కనిపిస్తున్నాయనే విమర్శలున్నాయి.
అందులో ఎన్నికల వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం కాకుండా, అక్రమ ఓట్లు కొనసాగేలా ఒత్తిడి తేవడం. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో జరిగే అక్రమ చొరబాట్ల నిరోధాన్ని బలహీనపరచడమే కాకుండా.. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను వ్యాప్తి చేయడం.. విదేశీ నిధుల నియంత్రణ చట్టాలను (FCRA) అడ్డుకోవడం. ఓటర్ల ధ్రువీకరణను నిరోధించడం.. అదేవిధంగా ప్రస్తుత ఓటర్ల దృష్టిలో ప్రభుత్వాన్ని బద్నాం చేయడం.. వ్యవస్థల స్థిరత్వాన్ని దెబ్బతీసి రాజకీయంగా తిరిగి పుంజుకోవడం వంటి చర్యలకు ఊపిరి పోస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
అందుకే.. అవార్డు వాపసీ నటనలు 2015లో.. జేఎన్యూ.. టుక్డే టుక్డే నిరసనలు 2016లో.. సీఏఏ నిరసనలు 2019-20లో.. రైతుల నిరసనలు 2020-21న..కుస్తీ వీరుల నిరసనలు 2023లో.. బొద్దింకల నిరసనలు 2026న.. ఇండికూటమి నిరసనలు 2026న.. ఇవన్నీ కూడా ఏదో స్వాతంత్ర కోసం చేస్తున్నట్టుగా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. ఇక వీరి నటనను చూసి ఆస్కార్ అవార్డ్ లేవల్లో చేస్తున్నారని జనం భావిస్తున్నారు.
మరోవైపు ప్రస్తుత పరిణామాలు తేలికగా కొట్టిపారేయడానికి విలులేవని.. ఇవి పక్కా ప్రణాళికతో జరుగుతున్న రాజకీయ వ్యూహంలో భాగమనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రాథమికమే, కానీ అది వ్యవస్థలను విచ్ఛిన్నం చేసే విధంగా మారితే నష్టపోయేది సామాన్య ప్రజలే అని గుర్తించలేని నేతలు రాజకీయాలు చేయడం విచారకరం అని చర్చించుకుంటున్నారు.


