National

PM modi : ప్రతి జిల్లాలో 5జీ.. ఖాతాల్లోకి రూ.50 లక్షల కోట్లు : ప్రధాని మోడీ

రచన: Kumar••5 నిమిషాల పఠనం

దేశంలోని ప్రతిజిల్లాలో 5జీ సేవలు విస్తరించాయని, ఫలితంగా మొబైల్ ద్వారానే అన్నిరకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇంటర్నెట్ వేగం టెలికాం రంగం, మొబైల్ ఫోన్స్, నెట్‌వర్క్‌, స్పెక్ట్రమ్‌లకే పరిమితం కాలేదని.. సుపరిపాలనకు, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించే అత్యంత కీలక సాధనంగా మారిందన్నారు.

దేశంలోని ప్రతిజిల్లాలో 5జీ సేవలు విస్తరించాయని, ఫలితంగా మొబైల్ ద్వారానే అన్నిరకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇంటర్నెట్ వేగం టెలికాం రంగం, మొబైల్ ఫోన్స్, నెట్‌వర్క్‌, స్పెక్ట్రమ్‌లకే పరిమితం కాలేదని.. సుపరిపాలనకు, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించే అత్యంత కీలక సాధనంగా మారిందన్నారు. ఢిల్లీలోని యశోభూమిలో గురువారం ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగించారు.

ఇంటర్నెట్ వినియోగంతో వందలాది ప్రభుత్వ సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ల‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వ సాయం లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌లకు అనుసంధానించిన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ జరుగుతోందన్నారు. దీంతో డిజిటల్ అనుసంధానిత విద్యకు మరింత ఊతం లభించిందని తెలిపారు. అయితే, టెలికాం, డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని అభిప్రాయపడ్డారు.

2022లో ఇదే వేదికగా దేశంలో 5G సేవలను ప్రారంభించుకున్నామని, 2023లో 5G సేవలను విస్తరించడంపై దృష్టి సారించగా.. నేడు దేశంలోని ప్రతి జిల్లాకూ 5G నెట్‌వర్క్ చేరుకుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.5 లక్షలకు పైగా బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. 2022తో పోలిస్తే ప్రస్తుతం మొబైల్ ఇంటర్నెట్ వేగం 10 రెట్లు పెరిగిందన్నారు.

దేశంలో 5జీ రీచ్‌ అవుట్ భవిష్యత్ వైపు దూసుకెళ్తోందన్నారు. గత దశాబ్దంలో దేశవ్యాప్తంగా టెలికాం మౌలిక వసతులు గణనీయంగా విస్తరించాయని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ, డేటా ధరలు అందుబాటులోకి రావడం వంటి పరిణామాలను ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఈ విస్తరణతో ఆర్థిక వ్యవస్థలో కొత్త రంగాలు పుట్టుకొచ్చాయని చెప్పారు.

డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా లబ్ధిదారుల మొబైల్ ఫోన్లతో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు రూ.50 లక్షల కోట్ల నిధులు చేరాయని మోడీ వెల్లడించారు. దాంతో సుమారు రూ.5 లక్షల కోట్లు ఆదా చేసినట్లు చెప్పారు.నిధులు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం డిజిటల్ విధానం వల్ల సాధ్యమైందన్నారు. పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసినట్లు మోడీ తెలిపారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నామని చెప్పారు. నగదు జమ అయిన వెంటనే రైతుల మొబైల్ ఫోన్లకు నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు.

#Pm modi#Delhi#mobile#digital usage#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి