National

CJP : జంతర్‌మంతర్ రావొద్దనే చెప్పే అధికారం మీకెవరిచ్చారు? : సీజేపీ

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఎస్ఐఆర్ పేరిట ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు సీజేపీ పార్టీలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే.

ఎస్ఐఆర్ పేరిట ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు సీజేపీ పార్టీలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు తరలిరావాలని సీజేపీ పార్టీ యువతకు పిలుపునిచ్చింది. అయితే, జంతర్ మంతర్ వద్దకు ఎవరూ రావొద్దని ఢిల్లీ పోలీసులు సూచించారు.

అయితే, ఢిల్లీ పోలీసుల తీరును 'కాక్రోచ్ జనతా పార్టీ'(CJP) తీవ్రంగా ఖండించింది. పోలీసుల సూచనపై సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు రావొద్దంటూ పిలుపు ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ప్రజలు నిరసనలో పాల్గొనాలా? వద్దా? అని అప్పీల్ చేయడానికి పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు? అని ప్రశ్నించారు.

పోలీసులు హెచ్చరికలు చేసినా ఎల్లుండి తాము అందరం శాంతియుతంగా నిరసన చేపడతామని స్పష్టంచేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. సీఈసీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ‘జంతర్ మంతర్’ కేటాయించాలని లేదంటే ఢిల్లీ మొత్తం జంతర్ మంతర్‌గా మారే పరిస్థితి వస్తుందన్నారు.కాగా, సీజేపీ పిలుపుతో జంతర్ మంతర్ వద్దకు యువత, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.

సీజేపీ, వామపక్షాలు, యువజన సంఘాలు నిర్వహిస్తున్న నిరసనలకు ప్రజలు హాజరుకావద్దంటూ ఢిల్లీ పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నిరసనకు పోలీసులు అధికారికంగా అనుమతి ఇవ్వలేదని పేర్కొంటూ విద్యార్థుల హాస్టల్స్, మార్కెట్ సంఘాలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లతో అధికారులు సమావేశమై చర్చలు జరుపుతున్నారు.గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగా హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 7 నుంచి 10 వరకు జరిగే ఆందోళనలో ప్రజలు పాల్గొనకుండా చూడాలని కోరుతున్నారు.

#CJP#protest#invitation#delhi#police warning#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి