Vaishnav Tej: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో కెరీర్ మరీ నత్త నడకన సాగుతుంది పంజా వైష్ణవ్ తేజ్‌దే. శంకర్ దాదా సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్న వైష్ణవ్..ఉప్పెన సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాతో ఒక డెబ్యూ హీరోగా మొత్తం సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలలో ఉన్న డెబ్యూ హీరో రికార్డ్స్‌ను బ్రేక్ చేశాడు. కానీ, ఆ క్రేజ్ తర్వాత సినిమాలకి కంటిన్యూ చేయలేకపోయాడు.
స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమాను చెశాడు వైష్ణవ్ తేజ్. అయితే, ఈ సినిమా అందరి అంచనాలను తారుమారు చేస్తూ డిజాస్టర్‌గా నిలిచింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. కరోనా సమయంలో కూడా అతికొద్ది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమా కొండపొలం మాత్రమే. మొదటి సినిమా ఉప్పెన భారీ హిట్ కావడంతో..సహజంగానే అంచనాలు ఏర్పడతాయి.
ఆ అంచనాల వల్లే మళ్ళీ ఇప్పటి వరకూ వైష్ణవ్ తేజ్ ఖాతాలో హిట్ చేరలేదు. రంగ రంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలను చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ చిత్రాలుగా నిలిచాయి. దాంతో, మళ్ళీ కొత్త సినిమా ప్రకటించలేదు. అయితే, లైనప్‌లో మాత్రం కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా, సర్కారు వారి పాట, ఫ్యామిలీ స్టార్ సినిమాలను తీసిన పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ స్టోరీ ఒకే అయిందట.
గీత గోవిందం లాంటి క్లాసిక్ హిట్ తర్వాత పరశురామ్ నుంచి వచ్చిన సర్కారు వారి పాట, ఫ్యామిలీ స్టార్ చిత్రాలొచ్చాయి. కాస్తో కూస్తో సర్కారు వారి పాట ఓకే గానీ..ఫ్యామిలీ స్టార్ మాత్రం నిర్మాత దిల్ రాజుకి భారీ నష్టాలను తీసుకొచ్చింది. గేమ్ ఛేంజర్, ఫ్యామిలీ స్టార్ సినిమాల దెబ్బతో ఇంకా కోలుకోలేదు దిల్ రాజు. మరి, పరశురామ్, పంజా వైష్ణవ్ తేజ్‌ల సినిమా ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి.












