National

Delhi: ఢిల్లీలో మరోసారి టెన్షన్ వాతావరణం..ఎఫ్ఐఆర్‌లో సెంచరీ కొట్టడమే లక్ష్యమన్న రాహుల్!!..

రచన: Venu••5 నిమిషాల పఠనం

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారంతో పాటు ఎస్ఐఆర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది.

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయం తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారంతో పాటు ఎస్ఐఆర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. రాబోయే ఎన్నికల సమరంలో ఎలాగైనా అధికార పీఠాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా కమల దళం వ్యూహాలు రచిస్తుంటే... ఆ వ్యూహాలను ఎక్కడికక్కడ తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బిజెపికి కొరకరాని కొయ్యలా మారుతుంది.

జంతర్ మంతర్ వద్ద పోరుకు పిలుపు

ఢిల్లీలోని సాగర్ రత్న హోటల్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన విపక్ష నేతల లంచ్ మీటింగ్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కలకలం రేపుతోంది. లోక్ సభ, రాజ్యసభలకు చెందిన సుమారు 300 మంది ఎంపీలతో ఈసీని కలిసేందుకు యత్నించిన విపక్షాలకు చుక్కెదురైయ్యింది... ఈ క్రమంలో తమ తదుపరి ప్రత్యక్ష పోరాటానికి జంతర్ మంతర్ ను వేదికగా ఎంచుకున్నాయి. భేటీ అనంతరం రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగి జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ పై రాహుల్ గాంధీ ఫైర్

మోదీ, అమిత్ షా ద్వయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి కుట్ర పన్నుతున్నారని, అందులో భాగంగానే ఈసీని కీలుబొమ్మగా వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చట్టబద్ధమైన అధికారి కాదని, ఆ పదవిలో ఆయనకు కొనసాగే అర్హత లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్‌లు ఉన్నాయన్న రాహుల్, సెంచరీ కొట్టడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇక కేంద్రంపెట్టే కేసులను పతకాలుగా భావిస్తాననడం ద్వారా అధికార పక్షానికి సూటిగా సవాల్ విసిరారు.

రాబోయే ఎన్నికల్లో వ్యూహాత్మక మార్పు

మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది.. గతంలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలను ఒక్కటి చేస్తూ కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ అగ్రెసివ్ వైఖరి... రాబోయే ఎన్నికల్లో బీజేపీకి సవాల్ గా మారబోతోందనే సంకేతాలను ఇస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, పోరాటాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకం చేసేందుకు విపక్షాలు వేస్తున్న వ్యూహాత్మక అడుగులు అధికార పక్షంలో కలవరాన్ని రేపుతున్నాయనే చర్చలు మొదలైనట్టు చెప్పుకొంటున్నారు..

అలర్ట్ అయిన కేంద్రం

మరోవైపు, విపక్షాల దూకుడుతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి ఢిల్లీని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. బస్సుల్లో ఎంపీలు అంతా జంతర్ మంతర్ వైపు కదలడంతో రాజధానిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాబోయే ఎన్నికల సమరానికి ముందే హస్తినలో రాజుకున్న ఈ పొలిటికల్ ఫైర్... రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి!..

#RahulGandhi#JantarMantarProtest#DelhiPoliticalTension#CongressVsBJP#PM Modi Amit Shah#IndianPolitics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి