Tollywood: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా..అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం..ఆయన సినిమాల నుంచి ఎప్పుడూ సరైన అప్‌డేట్స్ రావు. కానీ, బర్త్ డేకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక అప్‌డేట్ ప్రభాస్ సినిమాల నుంచి వస్తుంది. అందుకే, డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఈ తేదీ చాలా ఇంపార్టెంట్.
3 నిమిషాల 'ఫౌజీ' టీజర్:
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న పీరియాడిక్ సినిమా ఫౌజీ. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇన్స్టా ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్ అయ్యే అప్‌డేట్ ఏదీ రాలేదు. జస్ట్ ప్రభాస్ లుక్ తప్ప. వాస్తవానికి, రెండేళ్ళ నుంచి నిర్మాణంలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అన్నారు. కట్ చేస్తే, కొత్త డేట్ ప్రకటిస్తామని చల్లబరిచారు. అయితే, అక్టోబర్ 23న 3 నిముషాల నిడివితో ఫౌజీ టీజర్ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇది, ఎంతవరకు నిజమో చూడాలి.
కల్కి 2 అప్‌డేట్..పెద్దగా ఏమీ ఉండదేమో?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న మరో భారీ సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కీ 2. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ సినిమా షూటింగ్ 10 శాతమే అయింది. అక్టోబర్ నుంచి ప్రభాస్ కల్కీ సెట్స్‌లో జాయిన్ అవుతాడని నాగ్ అశ్విన్ చెప్పాడు. కాబట్టి, ఈ సినిమా నుంచి విజువల్ ట్రీట్ ఏదీ ఆశించడం అనవసరం.
స్పిరిట్ నుంచి టీజర్ వస్తే గ్రేటే:
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో డార్లింగ్ నటిస్తోన్న మరో హై ఓల్టేజ్ కాస్ స్టోరీ స్పిరిట్. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి ఫిలింస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఆల్రెడీ 40 శాతం షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఇంకో 20 శాతం కూడా పూర్తై ఉండొచ్చు. కాబట్టి, సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమా నుంచి ఇవ్వాలనుకుంటే సాలీడ్ టీజర్ ఇవ్వొచ్చు. కానీ, ఇప్పుడే అంత అదృష్టం ఫ్యాన్స్‌కి ఉండకపోవచ్చు.
సలార్ 2 నుంచి అసలు ఆలోచించకపోతే మంచిది:
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్‌టిర్ హీరోగా డ్రాగన్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఫోకస్ మొత్తం ఈ సినిమా మీదే పెట్టాడు. సలార్ సినిమాకి సంబందించి పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కూడా అవలేదు. కాబట్టి, ఈ సినిమా సెట్స్‌పైకి ఎప్పుడొస్తుందో కూడా చెప్పడం కష్టం. జస్ట్ సీక్వెల్ ఉంటుందని ఓ పోస్టర్ వదులుతారేమో గానీ..అంతకుమించి ఏదీ సలార్ 2 నుంచి ఆశించకూడదు. చూడాలి, మరి మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ఎలాంటి సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారో.


