తెలంగాణ

కడియం శ్రీహరి నన్ను దూషించారు, అందుకే ప్రతిస్పందించా- పాడి కౌశిక్ రెడ్డి

రచన: NK•••4 నిమిషాల పఠనం

తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి తన వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. 16 పేజీల్లో ఎథిక్స్ కమిటీకి వివరణ అంజేశారు. కడియం శ్రీహరి నన్ను దూషించారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కడియం శ్రీహరి దూషణలకు నేను ప్రతిస్పందించాను అని తెలిపారు. ఎథిక్స్ కమిటీ ముందుకు తనను, తన అడ్వకేట్ ను పిలవాలన్నారు.

Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి తన వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. 16 పేజీల్లో ఎథిక్స్ కమిటీకి వివరణ అంజేశారు. కడియం శ్రీహరి నన్ను దూషించారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కడియం శ్రీహరి దూషణలకు నేను ప్రతిస్పందించాను అని తెలిపారు. ఎథిక్స్ కమిటీ ముందుకు తనను, తన అడ్వకేట్ ను పిలవాలన్నారు.

కడియం శ్రీహరి వీడియో కూడా ఇవ్వండి

నా ఒక్కడి వీడియో మాత్రమే ఇచ్చారన్న పాడి కౌశిక్ రెడ్డి.. కడియం శ్రీహరి వీడియో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరిని తాను బెదిరించానన్న ఆరోపణలు నిరాధారం అని స్పష్టం చేశారు. వీడియోను తప్పుగా అర్థం చేసుకుని తనపై అభియోగాలు మోపారని పాడి కౌశిక్ రెడ్డి వాపోయారు. తోటి శాసనసభ్యుల పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని తేల్చి చెప్పారు. పాక్షిక వీడియో ఆధారంగా తీర్పు ఇవ్వద్దని ఎథిక్స్ కమిటీకి విజ్ఞప్తి చేశారు పాడి కౌశిక్ రెడ్డి. పూర్తి ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకోవద్దని ఎథిక్స్ కమిటీని కోరారు.

నువ్వు ఏ పార్టీలో గెలిచావు అని అడిగా

''కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను తిడుతుంటే.. నువ్వు ఏ పార్టీలో గెలిచావు అని అడిగా? అందుకు కడియం శ్రీహరి నన్ను దూషించారు. కడియం దూషణలపై నేను ప్రతి స్పందించాను. నా ఒక్కడి వీడియోనే ఇచ్చారు. కడియం శ్రీహరి వీడియో కూడా ఇవ్వండి'' అని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో కడియం శ్రీహరితో వాగ్వాదం

మార్చి 29న అసెంబ్లీలో జరిగిన ఘటనపై ఎథిక్స్ కమిటీ ముందుకు విచారణకు హాజరై తన వివరణ ఇచ్చారు కౌశిక్ రెడ్డి. ఆ రోజున కడియం శ్రీహరితో జరిగిన వాగ్వాదం, సభలో చోటు చేసుకున్న పరిణామాలపై తన వాదనలు కమిటీకి వినిపించారు. గతంలో తనకు అందించిన వీడియో ఫుటేజ్ అసంపూర్ణంగా ఉందని అభ్యంతరం తెలిపారు కౌశిక్ రెడ్డి. సభలో జరిగిన మొత్తం పరిణామాలకు సంబంధించిన పూర్తి వీడియో ఇవ్వాలని కోరారు. పూర్తి ఫుటేజ్ పరిశీలించిన తర్వాతే సమగ్ర వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు పూర్తి ఫుటేజ్ అందిన నేపథ్యంలో తన వివరణ ఇచ్చారు.

ఎథిక్స్ కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ

ఈ నెల 13న ఎథిక్స్ కమిటీ మరోసారి సమావేశం కానుంది. కౌశిక్ రెడ్డి ఇచ్చిన రిప్లయ్ పై కమిటీ చర్చించనుంది. కౌశిక్ రెడ్డి వివరణలు పరిశీలించిన తర్వాత ఎథిక్స్ కమిటీ తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

#Padi Kaushik Reddy#Brs#Ethics Committee#Kadiyam Srihari#Telangana Assembly#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి