రాజకీయాలు

బీఆర్ఎస్‌పై ఉత్తమ్ ఫైర్.. తప్పుడు ప్రచారాలతో నిజాలు మారవు!

రచన: Desk 23 నిమిషాల పఠనం

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులపై రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ బీఆర్ఎస్ పాలనలో ఆగమయ్యాయని ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ సమీపంలోని నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డిలతో కలిసి పరిశీలించారు.

అనంతరం సాగర్‌ విజయవిహార్‌ సమావేశ మందిరంలో నీటి పారుదలశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో బిఆర్ఎస్ పై మిమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజీని కమీషన్ల కోసం నాణ్యత లేకుండా నిర్మించడంవల్లే నేడు అది పనికిరాకుండా పోయిందని మండిపడ్డారు..

బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో కన్నెపల్లి పంపింగ్‌ చేపట్టడం సాధ్యం కావడం లేదని స్పష్టం చేశారు.

జాతీయ డ్యాం భద్రత మార్గదర్శకాల ప్రకారమే బ్యారేజీల నిర్వహణ కొనసాగుతోందని పేర్కొన్న ఆయన, శాస్త్రీయ పరీక్షలు పూర్తయ్యాక అవసరమైన పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ డ్యాం స్పిల్‌వే మరమ్మతులను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే నెల్లికల్లు ఎత్తిపోతల పథకం పనులను వచ్చే వేసవి నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

#telangana#political#nalgonda#utham kumar reddy#medigadda
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి