Ashika Ranganath: గ్లామర్ బ్యూటీ ఆషిక రంగనాథ్ తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమేనా? ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట్లాడుకుంటున్నారు. కన్నడతో పాటు తమిళం, తెలుగు సినిమాలలో కూడా హీరోయిన్‌గా నటించింది ఆషిక. తెలుగులో, అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ, నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాలో నటించింది. వీటిలో అమిగోస్ ఫ్లాపైనప్పటికీ, నాగ్ సరసన చేసిన నా సామిరంగ మూవీ మాత్రం ఓ మాదిరి హిట్ ని అందుకుంది.
వాస్తవానికి, ఆషిక రంగనాథ్ అటు యంగ్ హీరోలకి, ఇటు సీనియర్ హీరోలకి సరిపోయే అందం..ఫిజిక్ ఉన్నది. పర్ఫార్మెన్స్ పరంగా కూడా పరవాలేదనిపించుకుంది. కానీ, ఈ గ్లామర్ బ్యూటీ ఆశించిన అవకాశాలు మాత్రం దక్కడం లేదు. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర మూవీలో ఓ కీలక పాత్రను పోషించింది. త్రిష మేయిన్ హీరోయిన్ అయినప్పటికీ, ఆషిక కూడా తన నటనతో ఆకట్టుకుంటే మెగాస్టార్‌తో పంచుకునే స్క్రీన్ మరిన్ని అవకాశాలను తెస్తున్న ఆశతో ఉంది.
కానీ, ఎప్పటికప్పుడు విశ్వంభర సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మొన్నామధ్య వచ్చిన రవితేజ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. ఇందులో, ఆషిక అందాల విందు కుర్రకారును బాగా ఆకట్టుకుంది. అయితే, పరమ రొటీన్ కథ కావడంతో ఫ్లాప్ టాక్ వచ్చింది. దీనితో ఆషిక రంగనాథ్ రేసులో బాగా వెనకపడింది. రెండు సినిమాలతో బెస్ట్ యాక్ట్రెస్‌గా అవార్డులు దక్కించుకున్నప్పటికీ ఆశించిన అవకాశాలు మాత్రం రావడం లేదు.
ముఖ్యంగా, తెలుగు మేకర్స్ ఈ భామను పక్కన పెట్టినట్టే అంటున్నారు. ప్రస్తుతం తమిళంలో సర్దార్ 2 మూవీ తప్ప ఇంకో ప్రాజెక్ట్ ఏదీ లేదు. అందుకే, గ్లామరస్ ఫొటో షూట్స్‌తో ఆకట్టుకుని అవకాశాలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. చూడాలి మరి ఆషిక రంగనాథ్ టాలెంట్ అండ్ గ్లామర్‌కి తగ్గ పాత్రలు వచ్చి ఇండస్ట్రీలో నిలబడుతుందో లేదో.












