సినిమా

పంచెకట్టులో నందమూరి హీరో.. ఫస్ట్ లుక్ వదిలిన అనిల్ రావిపూడి!

రచన: Desk 33 నిమిషాల పఠనం

నందమూరి కల్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ (#VenkyAnil5) నుంచి శనివారం ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.

నందమూరి కల్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులకు చిత్రబృందం అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేశ్‌, కల్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ మల్టీస్టారర్ (#VenkyAnil5) నుంచి శనివారం ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కల్యాణ్ రామ్ ఎప్పుడూ లేని విధంగా కంప్లీట్ ట్రెడిషనల్ లుక్‌లో, పంచెకట్టుతో అదిరిపోయే గెటప్‌లో దర్శనమిచ్చారు.

ఈ సరికొత్త అవతారం నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా కల్యాణ్ రామ్‌కు విషెస్ చెబుతూ "నా మొదటి సినిమా 'పటాస్'తో నన్ను నమ్మి, దర్శకుడిగా నాకు లైఫ్ ఇచ్చిన నా ఫస్ట్ హీరో, బెస్ట్ బడ్డీ కల్యాణ్ రామ్. ఈ సినిమాలో ఆయన్ను సరికొత్త క్యారెక్టర్‌లో చూపించబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది" అంటూ అనిల్ రాసుకొచ్చారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన 'పటాస్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్ కావడం, దానికి తోడు విక్టరీ వెంకటేశ్ కూడా తోడవడంతో టాలీవుడ్‌లో ఈ చిత్రంపై అంచనాలు స్కై హైకి చేరాయి. షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో కీర్తి సురేశ్‌, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా రాకింగ్ స్టార్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

#KalyanRam#VenkyAnil5#AnilRavipudi#Venkatesh#Sankranthi2027#TeluguCinema
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి