క్రైమ్

కేతన్ అగర్వాల్ కుటుంబంలో మరో విషాదం!

రచన: Desk 33 నిమిషాల పఠనం

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్యతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న ఆ కుటుంబంలో మరో కోలుకోలేని విషాదం చోటుచేసుకుంది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్యతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న ఆ కుటుంబంలో మరో కోలుకోలేని విషాదం చోటుచేసుకుంది. కేతన్ తాత దేవీచంద్ అగర్వాల్ పూణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన తండ్రిని కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుకుంటూ కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్.. సోషల్ మీడియాలో ‘మిస్ యూ డాడ్’ అంటూ పెట్టిన భావోద్వేగ పోస్ట్ అందరినీ కలిచివేస్తోంది.

కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం.. కొంతకాలం క్రితమే దేవీచంద్‌కు పెద్ద గుండె ఆపరేషన్ (మేజర్ హార్ట్ సర్జరీ) జరిగింది. అప్పటి నుంచి వయోసహజ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను.. కొద్దివారాల క్రితం మనవడు కేతన్ అత్యంత పాశవికంగా హత్యకు గురికావడం మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఈ షాక్ వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించి, వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

కొద్ది వారాల క్రితం పూణెలోని లోహగడ్ కోట వద్ద 26 ఏళ్ల కేతన్ అగర్వాల్‌ను లోయలోకి తోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22) నిందితులుగా ఉన్నారు. పెళ్లి ఇష్టం లేకపోయినా, రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే సియా ఈ దారుణానికి ఒడిగట్టింది.

#KetanAgarwalCase#SiyaGoyal#DevichandAgarwal#LohagadFortMurder#PuneCrimeNews#TrendingNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి