సినిమా

Lenin: అఖిల్ మూవీ నుంచి 'జయ మంగళం' లిరికల్ వీడియో రిలీజ్

రచన: Desk 74 నిమిషాల పఠనం

Lenin: అక్కినేని వారసుడు, నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా లెనిన్ అనే సినిమా రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను మేకర్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ సాగుతున్నాయి.

Lenin: అక్కినేని వారసుడు, నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా లెనిన్ అనే సినిమా రూపొందుతోంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను మేకర్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా లెనిన్ సినిమా నుంచి జయ మంగళం అనే లిరికల్ వీడియో సాంగ్ రిలీజైంది. డివోషనల్ టచ్‌తో సాగిన ఈ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

రీసెంట్‌గా లెనిన్ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రారంభంలో "ఇది మహాభారతం"... అంటూ అక్కినేని నాగార్జున పవర్‌ ఫుల్‌ ఓవర్ మాంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే, ఈ ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్‌ కూడా వచ్చింది. హీరో అఖిల్‌ కూడా ఈ సారి హిట్ కొడతాను.. అంటూ ఎంతో నమ్మకంగా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, సినిమాపై అందరికీ నమ్మకం బలంగా ఉంది.

వీరిద్దరికీ హిట్ తప్పనిసరి:

లెనిన్ సినిమాతో మన ముందుకు రాబోతున్న హీరోహీరోయిన్లు అఖిల్-భాగ్యశ్రీ బోర్సేలకి గ్యారెంటీగా హిట్ తప్పనిసరి. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్‌గా ఒక్కటి కూడా సాలీడ్ హిట్‌గా భాగ్యశ్రీ ఖాతాలో చేరలేదు. ఇక, అఖిల్ కెరీర్‌లో ఇప్పటి వరకూ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన హిట్ ఒక్కటీ లేదు. దాంతో, లెనిన్ మూవీతో భారీ హిట్ సొంత చేసుకోవాలని ఇద్దరు సినిమా కోసం బాగానే శ్రమించారు.

మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో రూపొందుతున్న లెనిన్ సినిమాను అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా..అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మించారు. జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమవుతోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజైన జయ మంగళం లిరికల్ సాంగ్ వినసొంపుగా ఉంది. మరి, ఈ సాంగ్ యూట్యూబ్ లో ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో, సినిమాకి ఏమేరకు కలిసివస్తుందో చూడాలి.

#lenin#akhilakkineni#bhagyasriborsey#muralikishoreabburi#nagarjuna#ssthaman
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి
YouTubeలో చూడండి ↗

తర్వాత చదవండి