క్రైమ్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో సంచలన నిజాలు!

రచన: Desk 33 నిమిషాల పఠనం

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడుల వెనుక పక్కా ప్లాన్, ఆస్తి పంపకాల సమాచారం లీక్ కావడంతో పాటు పోలీస్ శాఖలోనే ఉన్న అంతర్గత శత్రుత్వం ప్రధాన కారణాలని తెలుస్తోంది.

  • కొడుకులకు వాట్సాప్‌లో ఆస్తి పంపకాల చిట్టా

  • బినామీల పేరిట బదిలీ.. లీకైన రహస్యం

  • పోలీస్ అధికారితో 15 ఏళ్లుగా వైరం

  • పరస్పర ప్రతీకార దాడులు చేసినట్లుగా నిర్దారణ!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డీఎస్పీ భీమ్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడుల వెనుక పక్కా ప్లాన్, ఆస్తి పంపకాల సమాచారం లీక్ కావడంతో పాటు పోలీస్ శాఖలోనే ఉన్న అంతర్గత శత్రుత్వం ప్రధాన కారణాలని తెలుస్తోంది. తన ఇద్దరు కుమారులు మేజర్లు కావడంతో, భవిష్యత్తులో గొడవలు రాకూడదనే ఉద్దేశంతో భీమ్ రెడ్డి ఇటీవల నెల రోజుల పాటు ఆస్తి పంపకాలు జరిపారు.

కొడుకులిద్దరికీ సమానంగా ఆస్తులు పంచి, ఆ వివరాలను వేరువేరుగా వారి వాట్సాప్‌లకు పంపారు. మిగిలిన ఆస్తిని తన భార్య పేరుతో పాటు, మాజీ హోమ్ గార్డ్ పురందర్ రెడ్డి సహా ఇద్దరు బినామీల పేర్లకు బదిలీ చేస్తూ కొత్త పత్రాలు రాయించారు. ఈ పంపకాల ప్రక్రియ ముగిసిన వెంటనే భీమ్ రెడ్డి దంపతులు చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. అయితే, అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆస్తి పంపకాల వాట్సాప్ చిట్టా కాస్తా బయటకు లీకై భీమ్ రెడ్డి ప్రత్యర్థుల చేతికి చిక్కింది.

దీంతో ప్రత్యర్థులు ఆ వివరాలను పక్కా ఆధారాలతో ఏసీబీకి అందించి భీమ్ రెడ్డిని బుక్ చేశారు. ఈ కేసు వెనుక 15 ఏళ్లుగా మరో పోలీస్ అధికారితో భీమ్ రెడ్డికి ఉన్న పాత కక్షలు, రాజకీయ కోణాలు కూడా బయటపడ్డాయి. గతంలో సదరు ప్రత్యర్థి అధికారిపై భీమ్ రెడ్డినే ఏసీబీ దాడులు చేయించగా, ఇప్పుడు అదే అధికారి సమయం చూసి రాజకీయ అండదండలతో భీమ్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలుస్తోంది.

#BhimReddyCase#ACBRaids#PoliceCorruption#BenamiAssets#CrimeNews#TrendingNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి