బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌తో సింపుల్‌గా జరిగింది. 61ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ బాంద్రాలోని తన నివాసంలో ఈ వివాహాన్ని చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.45గంటలకు మ్యారేజ్ పేపర్స్‌పై సంతకాలు చేశారు. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక ముగిసింది. ఆమిర్ కుమారుడు జునైద ఖాన్, కూతురు రా ఖాన్ తదితరులు ఈ వేడుకలో ఉన్నారు.
పెద్ద హంగూ ఆర్భాటాలు లేకుండా, ఇంట్లోనే సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఆమిర్ ఖాన్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే, పాలి హిల్‌లోని ఆయన నివాసాన్ని సర్వాంగ సుందరంగా, రంగురంగుల దీపాలతో ముస్తాబు చేశారు. వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేశారు. ఈ వేడుకకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రత్యేకంగా హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి, వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ముంబైలో భారీ వర్షాలు ఉన్నప్పటికీ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్ప్రట్‌తో మూడో వివాహాన్ని అనుకున్నట్లే సజావుగా పూర్తి చేసుకున్నారు. పాలి హిల్‌లోని ఆయన నివాసంలో సుమారు 100 నుండి 150 మంది అత్యంత ఆప్తులు, ప్రముఖుల సమక్షంలో ఈ రిజిస్టర్డ్ మ్యారేజ్ చాలా పరిమితంగా, ప్రశాంతంగా సాగింది. ఈ వేడుకకు ఆమిర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన భర్తతో కలిసి హాజరవగా, కుమారుడు జునైద్ ఖాన్, సోదరితో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గతంలో 1986లో రీనా దత్తాను (2002లో విడాకులు), ఆ తర్వాత 2005లో కిరణ్ రావును (2021లో విడాకులు) వివాహం చేసుకున్న ఆమిర్.. విడాకుల తర్వాత కూడా వారిద్దరితో ఎంతో స్నేహపూర్వక, గౌరవప్రదమైన బంధాన్ని కొనసాగిస్తుండడం విశేషం.












