సినిమా

Wamiqa Gabbi: ఇలాంటి సాలీడ్ హిట్ పడితే ఎవరైనా క్రేజీ హిరోయినే

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Wamiqa Gabbi: సినిమా అనేది మోస్ట్ ఎంటర్‌టైనర్. ఇందులో, నటించే హీరోహీరోయిన్స్ మీదనే సగం కథ ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వినోదాత్మకమైన సినీ పరిశ్రమలో సక్ససే అన్నిటికీ ప్రధానం. మరీ, ముఖ్యంగా సినిమా సక్సెస్‌కి హీరోయిన్‌ని ముఖ్యమైన ఎలిమెంట్‌గా చూస్తారు. కథలో, హీరోయిన్‌కి బలమైన పాత్ర దక్కి సినిమా హిట్ అయితే అందరూ క్రెడిట్ హీరోయిన్‌కి ఇస్తారు.

కొన్ని, సినిమాలలో హీరోయిన్ పాత్ర కేవలం అందాల ఆరబోతకే పరిమితం అవుతుంటుంది. ఇలాంటి సినిమాలు ఫ్లాపైతే హీరోయిన్ వల్లే..అని కూడా అనేస్తారు. వరుసగా గనక ఒక హీరోయిన్ నటించిన సినిమాలు ఫ్లాపవుతూ ఉంటే అదేదో ఆమె వల్లే ఈ ఫ్లాప్స్ వస్తున్నాయని ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ తగిలించి పొమ్మనలేక పొగ పెట్టేస్తారు. అలాంటి, హీరోయిన్స్ అడ్రస్ కూడా దొరకదు.

ఇక, కొందరు హీరోయిన్స్ కి నాలుగైదు సినిమాలు చేశాకో..కొన్నేళ్ళు శ్రమించాకో సాలీడ్ పడుతుంది. అలాంటి, హీరోయిన్ వామిక గబ్బి. హిందీలో దాదాపు పదేళ్ళ నుంచి సినిమాలు చేస్తూ వస్తోంది. తెలుగులోనూ భలే మంచి రోజు అనే సినిమా చేసింది. సుధీర్ బాబు హీరోగా నటించాడు. కొన్ని తమిళ సినిమాలలోనూ నటించింది. ఇవన్నీ, ఇప్పటి వరకూ వామికాకి క్రేజ్ తేలేదు. తాజాగా, వచ్చిన డీసీ మాత్రం సాలీడ్ హిట్ ఇచ్చింది.

ఈ సినిమాలో ఆమె పాత్రకి విపరీతమైన ఆదరణ దక్కింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బోల్డ్ అండ్ డీ గ్లామర్ రోల్ లో నటించిన వామిక కి డీసీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ దక్కింది. లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన మొదటి సినిమా. దీని తర్వాత, అందరూ వామిక డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే, జై హనుమాన్ మూవీ సైన్ చేసిందని వార్తలు వస్తున్నాయి. అలాగే, అడవి శేష్ సరసన జీ2 సినిమాలోనూ నటిస్తోంది. మొత్తానికి, తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఫుల్ బిజీగా మారింది వామిక గబ్బి.

#Wamiqa Gabbi#DC#LokeshKanagaraj#G2#AdaviSesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి