Cm Revanth: పంద్రాగస్టు రోజున సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడపనున్నారు. రోజంతా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆగస్టు 15వ తేదీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉదయం 8:45-9:00 గంటల వరకు తన నివాసంలో 80వ స్వాతంత్య్ర వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. 9:50 గంటలకి గోల్కొండ కోటలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 2.30 గంటలకి ఐఐటీ కంది ప్రాంగణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక, సాయంత్రం 6 గంటలకు లోక్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.


