తెలంగాణ

Mahesh Goud: పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒక్కటే, చర్యలు తప్పవు- రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ సీరియస్

రచన: NK••5 నిమిషాల పఠనం

Mahesh Goud: ప్రభుత్వం సీమాంధ్ర నేతల చెప్పు చేతల్లో ఉండొద్దు.. ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం కాదు.. పేదల కోసం పని చేయాలి అంటూ సొంత పార్టీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో దుమారం రేపాయి. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ సీరియస్ అయ్యారు.

Mahesh Goud: ప్రభుత్వం సీమాంధ్ర నేతల చెప్పు చేతల్లో ఉండొద్దు.. ప్రభుత్వం కాంట్రాక్టర్ల కోసం కాదు.. పేదల కోసం పని చేయాలి. తెలంగాణ ఉద్యమానికి, కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం లేని వాళ్లు ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవిస్తున్నారు. బయటి నుంచి వ్యక్తులు పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నారు అంటూ సొంత పార్టీ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో దుమారం రేపాయి. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ సీరియస్ అయ్యారు.

క్రమశిక్షణ తప్పితే ఇబ్బందులు తప్పవు..

రాజగోపాల్ రెడ్డి అంశం తమ దృష్టికి వచ్చిందన్న మహేశ్ గౌడ్.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదన్నారు. పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒక్కటే అని, క్రమశిక్షణ తప్పితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. బాధ, ఆవేదన ఉంటే మాట్లాడేందుకు సరైన వేదికలు ఉంటాయని హితవు పలికారు. రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ ఏమైనా హామీ ఇచ్చి ఉండొచ్చని.. ఆ హామీ అంశంపై హైకమాండ్ తో చర్చించుకోవాలని రాజగోపాల్ రెడ్డికి సూచించారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

పార్టీలో సీఎం సహా ఎవరికైనా ఒకే గౌరవం..

''కాంగ్రెస్‌ పార్టీలో సీఎం సహా ఎవరికైనా ఒకటే గౌరవం ఉంటుంది. రాజగోపాల్‌ రెడ్డికి కూడా అదే గౌరవం ఇస్తున్నాం. రాజగోపాల్‌రెడ్డి ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుంటాం. కానీ, పార్టీకి సంబంధించి నాలుగు గోడల మధ్య చర్చించాల్సిన అంశాలను బహిరంగంగా మాట్లాడకూడదు. పార్టీ లైన్ దాటి అలా మాట్లాడటం సరికాదు. సమయం వచ్చినప్పుడు అవకాశాలు ఉంటాయి. ఏం మాట్లాడినా హైకమాండ్ దృష్టికి వెళ్తుంది. బిల్లుల విషయంలో ఒక క్రమ పద్ధతిలో ముందుకెళ్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం తరహాలో మేము చేయడం లేదు. ఇందిరమ్మ ఇళ్లు లాటరీ విధానంలోనే ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా అవినీతి లేదు’ అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

అయితే తానెక్కడా కాంగ్రెస్ నాయకులను కానీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించలేదని, విమర్శించబోనని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పార్టీలో బయటి నుంచి వచ్చిన వ్యక్తుల పెత్తనం ఎక్కువైందని మాత్రమే చెప్పానని అన్నారు. నిజమైన కాంగ్రెస్ నాయకులను అణిచివేస్తున్నారని గుర్తు చేశానన్నారు.

#Mahesh Kumar Goud#TPCC#Telangana Congress#Komatireddy Rajagopal Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి