Prabhas: మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్నవి ఫౌజీ, స్పిరిట్. ఈ సినిమాలను సమాంతరంగా పూర్తి చేస్తున్నాడు. రెండు సినిమాలలోని పాత్రలు వేటికవే ఎంతో ప్రత్యేకం. స్పిరిట్ చిత్రాన్ని అర్జున్‌రెడ్డి, అనిమల్ చిత్రాల సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నాడు. సున్నితమైన ప్రేకథలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న హను రాఘవపూడి ఫౌజీ రూపొందిస్తున్నాడు.
ఫౌజీ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే, అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 2న ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేశారు. ఇందులో ప్రభాస్ పాత్ర ఆర్మీ ఆఫీసర్ అని తెలుస్తోంది. హెవీ యాక్షన్ అండ్ ఎమోషన్స్, దేశభక్తి ప్రధానంగా కథ సాగుతుందట. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన ప్రభాస్ లుక్ ప్రతీ ఒక్కరినీ బాగా ఆకట్టుకుంది. అయితే, తాజాగా ప్రభాస్ తన ఇన్స్టా డీపీగా ఫౌజీ లుక్ ని అప్‌డేట్ చేశాడు.
బాహుబలి సినిమా నుంచి ఇప్పటి వరకూ అదే లుక్ ప్రభాస్ ఇన్స్టాకి ఉండేది. బాహుబలి సినిమాలలో తండ్రీకొడుకులుగా మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి పాత్రల్లో ప్రభాస్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రల మేకోవర్ లుక్ అద్భుతంగా ఉంటుంది. ఈ లుక్స్ ప్రభాస్‌కి ఎంతగానో నచ్చాయి. అందుకే, అప్పటి నుంచి ఇప్పటి వరకూ బాహుబలి పోస్టర్‌నే ప్రభాస్ ఇన్స్టా డీపీగా పెట్టుకున్నాడు. కానీ, తాజాగా, ఆయన ఫౌజీ పోస్టర్‌తో అప్‌డేట్ చేశాడు.
దీంతో, ప్రభాస్ కంప్లీట్‌గా ఫౌజీ మోడ్‌లో వచ్చేశాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక, ఈ సినిమా ద్వారా ఇన్స్టా ఫేమ్ ఇమాన్వీ ఇస్మాయెల్ హీరోయిన్‌గా పరిచయమవుతోంది. టీ-సిరీస్ వారితో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, చైత్ర జె. అచార్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవనుంది. కానుంది.


