Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరోలలో వెంకటేష్‌కి ఉన్న ఇమేజ్ ఎంతో ప్రత్యేకమైనది. ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఒక సపరేట్ ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. దగ్గుబాటి రామానాయుడి తనయుడిగా వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్ళు పూర్తైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా నుంచి వెంకీ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
అనిల్ రావిపూడి, వెంకటేష్ కలయికలో వస్తోన్న 5వ సినిమా ఇది. ఇందులో, నందమూరి కల్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతీ శెట్టి నటిస్తోంది. ఇప్పటికే, ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. మొన్ననే ఈ నలుగురిపై ఒక సాంగ్ కూడా షూట్ చేశారు.
ఇక, తాజాగా వెంకటేష్ పాత్రను రివీల్ చేస్తూ అనిల్ రావిపూడి బృందం ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి 40 ఏళ్ళు పూర్తైన సందర్భంగా లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రను పరిచయం చేస్తూ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో, వెంకీ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో ధీమాగా కనిపిస్తున్నాడు.
అంతేకాదు, సన్‌గ్లాసెస్ స్కార్ఫ్ పెట్టుకొని మాంచి రగ్గడ్ లుక్ లో చాలా పవర్ ఫుల్‌గా కనిపించాడు. ఈ సినిమాలో వెంకీ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఇది చాలా పవర్‌ఫుల్ గా ఉంటుంది. ఇదేకాక ఇండియన్ ఆర్మీలో పనిచేసే వెంకీ కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో ఎక్స్‌పెర్ట్ గా కనిపించబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. కాగా, ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు.


