Tarun: తరుణ్..ఈ పేరు వింటే ప్రతీ ఒక్కరికి గుర్తొచ్చే మొదటి సినిమా నువ్వే కావాలి. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో హీరోగా తరుణ్, హీరోయిన్‌గా రీచా, కీలక పాత్రల్లో సాయి కిరణ్, వర్ష పరిచయమయ్యారు. కోటి అందించిన మ్యూజి సినిమాకి పెద్ద ఎసెట్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన కథ-మాటలు సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి.
ఈ సినిమా తర్వాత తరుణ్ నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించాయి. ప్రియమైన నీకు, నువ్వు లేక నేను, నువ్వే నువ్వే, నవ వసంతం, నిన్నే ఇష్టపడ్డాను..ఇవన్నీ తరుణ్ మార్కెట్‌ని ఒక్కసారిగా పెంచాయి. లవర్ బాయ్‌గా అప్పట్లో తరుణ్ కి ఉన్న క్రేజ్ ఇంకెవరికీ లేదు. అయితే.. సోగ్గాడు, అదృష్టం, చిరుజల్లు, అంకుల్, సఖియా, భలే దొంగలు, శశిరేఖా పరిణయం లాంటి సినిమాలు తరుణ్‌ని కిందకి లాగేశాయి.
అదే, సమయంలో హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ తో ప్రేమాయణం సాగించి మోసగించాడనే ఆరోపణలు ఎదురుకున్నాడు. ఒకవైపు ఆరోపణలు, ఇంకోవైపు సినిమాలు ఫ్లాపవడం, బిజినెస్ పెడితే అందులోనూ నష్టాలు..ఇలా ఒక్కసారిగా తరుణ్‌ని సమస్యలు చుట్టుముట్టాయి. ఆ ప్రభావంతో హీరోగా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఫ్యామిలీకి సినిమా పరిశ్రమతో మంచి బాండింగ్ ఉన్నా, తరుణ్ కి మాత్రం అవకాశాలు తేలేకపోయాయి.
ఫేడవుట్ అయిన చాలామంది సీనియర్ హీరోలు ఇప్పుడు విలన్ పాత్రలతో, క్యారెక్టర్స్‌తో మళ్ళీ బిజీ అయ్యారు. కానీ, ఒకప్పుడు లవర్ బాయ్‌గా స్టార్ ఇమేజ్ ఉన్న తరుణ్ కి మాత్రం కనీసం విలన్ పాత్రలైనా చేసే ఛాన్స్ రావడం లేదు. మరి, తరుణ్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదా, నిజంగా అవకాశాలు రావడం లేదా, మేకర్స్ అందరూ పక్కన పెట్టారా అనేది మాత్రం తెలియదు. తరుణ్ గనక సినిమాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా మంచి పాత్రలే వస్తాయి. పైగా ఈ యంగ్ హీరో చేసిన మేకర్స్ అంతా అత్యంత సన్నిహితులే. మరి, ఈ గ్యాప్ ఎక్కడొస్తుందో ఎందుకొస్తుందో తరుణ్‌కే తెలియాలి.


