సినిమా

Megastar: చిరుతో బుచ్చిబాబు..ఈ కాంబో ఫిక్సైందా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Megastar: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీకొచ్చిన ప్రతీ దర్శకుడు కల కంటాడు. కానీ, అందరికీ ఆ అవకాశం రావడం చాలా కష్టం. ఆయన ఇమేజ్‌కి తగ్గ కథ రాయాలి, ఆ కథ మెగాస్టార్‌కి నచ్చాలి. కథ నచ్చి, బాగా తీయగల సత్తా ఉందనిపిస్తే మెగాస్టార్ ఎవరికైనా అవకాశం ఇస్తాడు. అలాంటి మెగా అభిమానులెందరో ఇండస్ట్రీలో పెద్ద దర్శకులయ్యారు.

Megastar: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీకొచ్చిన ప్రతీ దర్శకుడు కల కంటాడు. కానీ, అందరికీ ఆ అవకాశం రావడం చాలా కష్టం. ఆయన ఇమేజ్‌కి తగ్గ కథ రాయాలి, ఆ కథ మెగాస్టార్‌కి నచ్చాలి. కథ నచ్చి, బాగా తీయగల సత్తా ఉందనిపిస్తే మెగాస్టార్ ఎవరికైనా అవకాశం ఇస్తాడు. అలాంటి మెగా అభిమానులెందరో ఇండస్ట్రీలో పెద్ద దర్శకులయ్యారు.

బుచ్చిబాబు సానా.. మెగాస్టార్ కోసం కథ తయారు చేస్తున్నట్టుగా ఇప్పుడు, ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఉప్పెన సినిమాతో దర్శకుడయ్యాడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడుగా ఆల్రెడీ మంచి పేరుంది. మొదటి సినిమాతో మెగా హీరో ఎంట్రీతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశాడు. దీంతో, రామ్ చరణ్‌తో పెద్ది చేసే ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ కోసం కథ సిద్ధం చేస్తున్నాడట.

అయితే, ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మెగాస్టార్‌ని పెద్ది ప్రమోషన్స్‌లో మీరు ఓకే అంటే మీకోసం కథ రాస్తానని చెప్పాడు. కానీ, ఇప్పుడు మాత్రం చిరుకోసం రాయడం లేదు. అది, ఇప్పట్లో జరిగే పని కూడా కాదు. దీనికి, కారణం పెద్ది ఫలితమే. ఈ సినిమా సక్సెస్ పూర్తి స్థాయిలో మెగాస్టార్‌ను సంతృప్తి పరచలేదు. కాబట్టి, బుచ్చిబాబుకి చిరు ఛాన్స్ ఇవ్వడం కాస్త కష్టమే. బుచ్చిబాబు సాలీడ్ హిట్ కొట్టాకే చిరు ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం, చిరంజీవి రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి, బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా. మెగా 158 అనే వర్కింగ్ టైటిల్‌తో ఇది తెరకెక్కుతోంది. కదిరి అనే పేరుతో మొదలయ్యే టైటిల్‌ని మేకర్స్ ప్రకటించబోతున్నారు. ఈ సినిమాను 2027, సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అలాగే, లైన్‌లో దసరా, ది ప్యారడైజ్ చిత్రాల యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాను చేయ్యాల్సి ఉంది. నానీ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఇవి కాకుండా మరో, రెండు సినిమాలు చర్చల దాలో ఉన్నాయి. మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22న వీటికి సంబందించిన అప్‌డేట్స్ రావచ్చు.

#megastar#megastarchiranjeevi#buchibabusana#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి