దగ్గు, జలుబు ఉన్న సమయంలో ఆరోగ్యం పై మనం తీసుకునే ఆహారం ఎంతగానో ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారగానే చాలామందిని జలుబు, దగ్గు, గొంతు నొప్పి వేధిస్తుంటాయి. ఇలాంటి సమయంలో సరైన ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం అని అంటున్నారు..
ముందుగా ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి నీరు, ఐస్‌క్రీమ్‌లు, చల్లని పానీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గొంతులో శ్వాసనాళాలకు ఇబ్బందికారంగా మారడమే కాకుండా.. చికాకును ఇన్ఫెక్షన్‌ను పెంచుతాయని అంటున్నారు. అలాగే పంచదార ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు, సోడాలు శరీరంలో వాపును పెంచి, రోగనిరోధక వ్యవస్థ వైరస్‌తో పోరాడే సామర్థ్యాన్ని తాత్కాలికంగా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు..
మరోవైపు సమోసాలు, బజ్జీలు వంటి నూనెలో వేయించిన వేపుళ్లకు, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది. ఇవి జీర్ణక్రియను మందగింపజేస్తాయి. శరీరం తన శక్తినంతా ఆహారాన్ని అరిగించడానికే ఉపయోగిస్తే, ఇన్ఫెక్షన్ నుంచి త్వరగా కోలుకోవడానికి శక్తి తగ్గుతుందని చెబుతున్నారు.. ఇక సాధారణంగా పాలు, పెరుగు తింటే కఫం పెరుగుతుందని అనుకుంటారు. కానీ శాస్త్రీయంగా పాలు కఫాన్ని కొత్తగా తయారుచేయవని నిపుణులు తెలుపుచున్నారు..
కాకపోతే గొంతులో శ్లేష్మాన్ని కాస్త చిక్కబడేలా చేస్తాయని.. అందుకే గొంతు నొప్పి ఉన్నప్పుడు చల్లటి పెరుగు లేదా అధికంగా పాల ఉత్పత్తులు తీసుకోకపోవడమే మేలని సూచిస్తున్నారు.. అలాగే విటమిన్ సీ ఉన్న పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, గొంతు తీవ్రంగా ఇన్ఫెక్షన్ గురైనప్పుడు బాగా పుల్లగా ఉండే సిట్రస్ పండ్లు గొంతుకు చికాకు కలిగించే అవకాశం ఉందని అంటున్నారు..
అలాగే వీటితో పాటు కాఫీ, టీలు ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జలుబు ఉన్నప్పుడు కాఫీ టీలకు బదులుగా గోరువెచ్చని నీరు, అల్లం టీ, వేడి వేడి సూప్‌లు, తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని ఆరోగ్యనిపుణులు పేర్కొంటున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..


