స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Medchal: శామీర్ పేట్‌లో కదం తొక్కిన కిసాన్!..

రచన: Venu•••9 నిమిషాల పఠనం

బొమ్మరాసిపేట్‌లో వెయ్యి ఎకరాల్లో యజమానులకు తెలియకుండానే పాసు బుక్‌లు బదిలీ చేస్తున్న తీరుపై రైతులు భగ్గుమన్నారు. ఎలాంటి రూల్స్ పాటించకుండా హైకోర్టు 2021న ఆర్డర్ ఇచ్చిందనే ఒకే ఒక్క కారణంతో భూములు బదులాయిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

- అక్రమంగా పాస్ బుక్‌ల బదలాయింపుపై నిరసన

- హజరైన బీజేపీ ఎంపీ ఈటల, బీఆర్ఎస్ నేతలు

- అధికారుల తీరుపై మండిపాటు

- ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన వైనం

- కేసీఆర్ కాన్వాయిని ఆపి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం

- నేషనల్ హైవేపై 5 నిమిషాలు బైఠాయించినందుకు కేసు నమోదు?

- రాత్రి పోలీస్ స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి ఒత్తిడి?

- బొమ్మరాసిపేట్ భూ బాగోతంపై స్వేచ్ఛ న్యూస్ వరుస ఇన్వెస్టిగేషన్ కథనాలు

- రైతుల ధర్నాతో మేల్కొన్న మెయిన్ స్ట్రీం మీడియా

- ఇప్పటికైనా అధికారులు పొజిషన్‌తో పాటు 30 ఏండ్ల టైటిల్ పరిగణనలోకి తీసుకుంటారా?

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ ఛైర్మన్

బొమ్మరాసిపేట్‌లో వెయ్యి ఎకరాల్లో యజమానులకు తెలియకుండానే పాసు బుక్‌లు బదిలీ చేస్తున్న తీరుపై రైతులు భగ్గుమన్నారు. ఎలాంటి రూల్స్ పాటించకుండా హైకోర్టు 2021న ఆర్డర్ ఇచ్చిందనే ఒకే ఒక్క కారణంతో భూములు బదులాయిస్తారా? గత 50 ఏండ్లుగా ఉన్న రికార్డులను పరిశీలించాల్సిన అవసరం లేదా? పొజిషన్‌లో ఎవరు ఉన్నారో ఆర్‌ఐతో ఎంక్వైర్ చేసుకోకుండానే రాత్రికి రాత్రి పాసు బుక్‌లు ఇచ్చేస్తారా? కోర్టులు తీర్పు ఇస్తే గ్రౌండ్ స్థాయిలో దర్యాప్తు చేసి నివేదికలు ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్స్ ఉండదా? కొర్టు వంకల పేరుతో రూ.10 వేల కోట్ల భూస్కాంకు పాల్పడితే చూస్తూ ఊరుకుంటామా? అంటూ నిలదీశారు.

బీఆర్ఎస్‌లో వేసిన విత్తనాలే, కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. నాయకుల అధికార మార్పిడి జరుగుతుంది, కాని 30 ఏండ్లు ఉండాల్సిన అధికారులు లంచాలకు అలవాటు పడి ఏ పనైనా చేస్తామంటే జైలు పాలు అవుతారని హెచ్చరించారు. రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. వివిధ దశల్లో కొనుగోలు చేసిన రైతుల భూమిని ఇంచు కూడా వదిలేది లేదంటూ హెచ్చరించారు.

మరోవైపు ఈ వ్యవహారం పై మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, 22(ఏ) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేరుతో అనుచరులు, షాడోలు చేస్తున్న బాగోతాన్ని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. రైతులకు ఆపద ఉంటే ఏ క్షణమైనా వచ్చి నిలబడుతామని వారు భరోసా ఇచ్చారు.

స్వేచ్ఛ ఇన్వేస్టిగేషన్ కథనాలతో ఉత్తేజవంతులైన యజమానులు..

ప్రజలు ఇలాంటి జర్నలిజాన్నే కోరుకుంటున్నారని ప్రశంసలు

ఓఆర్ఆర్‌కు ఆనుకుని ఉన్న వెయ్యి ఎకరాలను ఆదిత్య యాదవ్ అనే ఎన్ఆర్ఐతో కలిసి గతంలో కొంత మంది బీఆర్ఎస్ నేతలు రికార్డులు మార్చాలనే ప్రయత్నం చేశారు. అందుకు అనుకూలంగా 2021లో హైకోర్టు నుంచి తీర్పు తీసుకొచ్చారు.

దాన్ని పరిశీలించి రెవెన్యూ అధికారులు సరైన నివేదిక అందించాలి. కాని దురుద్దేశంతో వారికి సహకరించేందుకు ఆనాటి కలెక్టర్ అమోయ్ కుమార్ ఏక పక్షంలో రిపోర్ట్ రాసి ఇచ్చారు. దీంతో అప్పుడే తీవ్ర వ్యతిరేకత రావడంతో ఫైల్ పక్కన పెట్టారు.

2026లో ఓ మంత్రి కుమారుడి స్నేహితులకు 10 ఎకరాల భూమి బదులాయింపులతో పాటు ఆ పది ఎకరాలకు ఆధార్ కార్డు సమర్పించగానే పాస్‌బుక్‌లు జారీ చేశారు. మీరు ఫోన్స్ చేస్తే చాలు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలకు కొంత మంది మధ్యవర్తులు ఊరించారు. దీంతో మళ్లీ ప్రైవేట్ ల్యాండ్‌కు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఒపీనియన్ కావాలని అందుకు ఫైల్స్ (2026 ఏప్రిల్ 29) ను ఎమ్మార్వో తీసుకెళ్లి ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

30న ఏజీ కలెక్టర్‌కు రిపోర్ట్ కూడా పంపించారు. అదే రోజు సీసీఎల్ఏకు కలెక్టర్ లెటర్ రాశారు. సీసీఎల్ఏ మూడో రోజు ప్రభుత్వ అనుమతికి రిఫర్ చేశారు. రెండు రోజుల్లోనే ప్రభుత్వం నుంచి లోకేష్ కుమార్ క్లియరెన్స్ ఇచ్చారు. ఆ వెంటనే కొన్ని భూములు రిజిస్ట్రేషన్‌కు రెడీ అయ్యాయి. రైతులకు తెలియకుండానే వీళ్లు అప్లికేషన్ పెట్టుకున్నారని పాస్ బుక్‌లు ఇవ్వడంతో దుమారం చెలరేగుతోంది.

మరోవైపు 1965 నుంచి ఏం జరిగిందో స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి పూస గుచ్చినట్లు ప్రతిది సాక్ష్యాధారాలతో రైతులకు అవగాహన కల్పించారు. దీంతో తమ భూములను కొట్టేస్తారని బాధపడుతున్న వారంతా ఉత్తేజవంతులయ్యారు.

40 ఏండ్ల నుంచి క్రయ విక్రయాలు చేసుకున్న రైతులు, నాలా కన్వర్షన్ అయినా కోర్టు తీర్పు ఎవరికి వారుగా లేకుండా ఇష్టానుసారంగా ఇవ్వడంపై నిలదీశారు. ధర్నాకు ప్లాన్ చేసుకుని రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రతిపక్ష పత్రిక అయిన నమస్తే తెలంగాణలో కూడా రాసేలా చేశారు.

దీంతో స్వేచ్ఛ న్యూస్ కథనాలు లేకుంటే మరో నెల రోజుల్లో తమ భూములు అన్ని తెలియకుండానే మారిపోయేవని వాపోయారు. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్‌కు ఫిదా అయిపోయామని రైతులు ఫోన్ చేసి వారి కృతజ్ఞత తెలుపుకున్నారు.

కేసీఆర్‌ను కలిసే ప్రయత్నంలో కేసులు

శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి పట్నానికి వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న రైతులు, ఆయనను కలిసి తమ సమస్యలు, సాధకబాధకాలు వివరించాలనే నిర్ణయంతో రోడ్డుపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. అయితే వారు ఐదు నిమిషాలు కూడా ధర్నా చేయకుండానే ట్రాఫిక్ క్లియరెన్స్‌లో భాగంగా పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.

అయితే అప్పటి వరకు రైతులు టెంట్ కింద కొనసాగించిన నిరసనకు పెద్దగా ప్రచారం రాలేదు. కానీ కేసీఆర్ కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఆయనను ఆపి తమ సమస్యలను విన్నవించుకోవాలని రైతులు ప్రయత్నించారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యింది. ఇక కాంగ్రెస్ సోషల్ మీడియాలో కొందరు కేసీఆర్ కారును రైతులు అడ్డుకున్నారని, మరికొందరు కేసీఆర్‌కు రైతుల వినతి అంటూ ప్రచారం చేయడంతో ఈ సీన్ వైరల్‌గా మారింది.

దీంతో పోలీసులు నేషనల్ హైవేని నిర్బందించారనే కోణంలో రైతుల పై అక్రమంగా కేసులు నమోదు చేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా ఐదుగురు రైతులైన వచ్చి ఆధార్ కార్డులు ఇచ్చి లొంగిపోవాలని అర్ధరాత్రి వరకు ఫోన్స్ చేసినట్లు రైతులు స్వేచ్ఛ న్యూస్‌కు తెలిపారు.

#Medchal#Shameerpet#Bommarasipet#KCR#BJP MP#Etela Rajender#Land grabbing
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి