స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

Rayadurgam: కళ్లన్నీ రాయదుర్గం పైనే?

రచన: Swechaanews Chairman••5 నిమిషాల పఠనం

దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టెట్ మార్కెట్ దివాలా తీసినా హైదరాబాద్ రాయదుర్గంలో మాత్రం ఆసియా ఖండంలోనే అత్యధిక ధర పలికే ఇండస్ట్రియల్ ప్రాంతంగా ఉంది. నాలెడ్జ్ పార్క్ హబ్‌కు చుట్టూ మైండ్ స్పేస్‌తో పాటు మరెన్నో సాప్ట్‌వేర్ కంపెనీలు, ఓల్డ్, న్యూ హైదరాబాద్‌తో పాటు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నాయి.

  • వజ్రాల గని కంటే విలువైనది అంటూ నమ్మకం?

  • అది పెద్దల గద్దలకైనా.. ప్రభుత్వ వేలానికైనా?

  • ప్లాట్ 1, 2 వివాదాలు మళ్లీ కోర్టు వద్దకే

  • మొన్న వేలంలో ఎస్బీఐ బ్యాంకు భూమి పంచాయితీ కూడా అక్కడికే

  • అంతకుముందు ఈ భూములపై ఎన్నో అనుమానాలు

  • వంశీరాం, అపర్ణకు ఇచ్చిన బడా నిర్మాణ స్కాం కూడా ఇక్కడే? 

  • అడ్డుకుంటోంది ఎవరు?.. వారి దురుద్దేశం ఏంటి?

  • రాయదుర్గంలో రాయల్ స్కాంపై స్వేచ్ఛ న్యూస్ స్టోరీ

 దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809

 దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టెట్ మార్కెట్ దివాలా తీసినా హైదరాబాద్ రాయదుర్గంలో మాత్రం ఆసియా ఖండంలోనే అత్యధిక ధర పలికే ఇండస్ట్రియల్ ప్రాంతంగా ఉంది. నాలెడ్జ్ పార్క్ హబ్‌కు చుట్టూ మైండ్ స్పేస్‌తో పాటు మరెన్నో సాప్ట్‌వేర్ కంపెనీలు, ఓల్డ్, న్యూ హైదరాబాద్‌తో పాటు ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉన్నాయి. లేక్ , హిల్ వ్యూ ఉండటంతో ఈ భూముల పైనే అందరి కళ్లు పడ్డాయి. గౌర వెంచర్స్ వాళ్లు రూ.237 కోట్లకు ఎకరం కొనుగోలు చేశారు. అది ఎస్బీఐది అని తేలింది. వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో సీఎం రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో రాజీకొచ్చారు. మూడు వారాలు స్టే దొరికింది.

 ఇవాళ్టి కేసు ఇదే?

 ఈ నెల 1న ఈ రాయదుర్గం భూములు అమ్ముకునేలా ప్రభుత్వం వేలం వేసింది. ఇందుకు ప్లాట్ వన్ 17న, ప్లాట్ 2 , 21న వేలం వేసేలా సర్వే నెంబర్ 83/1 లో నోటిఫికేషన్ ఇచ్చింది.  దీనిపై పిటిషనర్ హెరిటెజ్ ఫ్రీసింక్ట్ లేదా రాక్ ప్రిజర్వ్డ్ కాబట్టి వేలం వేయొద్దు అని పిటిషన్ వేశారు. 2003లో జీవో నెం. 4 ద్వారా నోటిఫై చేశారని తెలిపారు. హెరిటెజ్ పేరుతో ఉన్న 424 ఎకరాలు ఐటి పార్క్ కి కేటాయింపు,  2006 లోని జీవో నెం. 161 ప్రకారం చెరువు ఉందని, తోపో షీట్ ప్రకారం ఇక్కడ పచ్చదనం ఉండాలి. హైడ్రా బాషలో చెప్పాలి అంటే ఇదంతా ప్రభుత్వ భూమితో పాటు, గ్రీనరీ దీన్ని ఎవరు ముట్టుకోవద్దని స్పష్టం చేసింది.  కానీ 2008 నుంచి 2010 వరకు నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన భూములు ఆలస్యం అయినా ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటిలో హెరిటేజ్ నిబంధన లేదు. కాని పదిన్నర ఎకరాల ప్రాంతానికి ఈ హెరిటేజ్ జీవో అడ్డు తగులుతుందా? లేదా అనేది తదుపరి ఉత్వర్వులకు లోబడి ఉండాలని హైకోర్టు మౌళిక ఆదేశాలు జారీ చేసి తుదపరి విచారణ 21కి వాయిదా వేసినట్లు సమాచారం.

 83/2లో కూడా పనులు

 ఇదే సర్వే నెంబర్‌లో ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వం ఫైట్ చేస్తోంది. ఇందులో 100 ఎకరాలు ఉంటుంది. కాని ఎప్పుడు ఛాన్స్ దొరికినా ప్రభుత్వ అధికారులతో తప్పుడు అఫిడవిట్స్ కోర్టుకు సమర్పించి ప్రైవేట్ పరం చేసేలా కుట్రలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రభుత్వ భూములపై స్వేచ్ఛ నిఘా పెడుతూనే ఉంటుంది. గతంలో పనులు జరిగితే వార్తలు ప్రచురించి ఆపివేసేలా చేసింది స్వేచ్ఛ న్యూస్.

#Raidurgam Real Estate#Hyderabad Land Auction#Knowledge City Survey 83#High Court Land Dispute#Swecha News Exclusive#Telangana Government Lands#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి