Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశ భక్తి ప్రధానంగా వచ్చిన సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. కమర్షియల్ అంశాలను జోడించి హీరో పాత్రను, లేదా కథను దేశ భక్తికి మిళితం చేసిన మన దర్శకులు తీస్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలాంటి, సినిమాలను ఒకసారి చూద్దాం.
అల్లూరి సీతారామరాజు:

అల్లూరి సీతారామరాజు సినిమా 1974లో వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమాలో ఆయన మన్యం వీరుడి పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. వాస్తవానికి, ఈ కథతో అంతకముందు నందమూరి తారకరామారావు చెయ్యాలని పలు కారణాల వల్ల ఆగిపోయారు. ఆ కథతో కృష్ణ తీయాలనుకున్న విషయం తెలిసి వద్దని కూడా సలహా ఇచ్చారు. కానీ, కృష్ణ వినలేదు. ఫలితంగా ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు మూవీ గురించి మాట్లాడుకుంటాము.
ఖడ్గం:

తెలుగు సినిమా పరిశ్రమలో పెను సంచలనం సృష్ఠించిన సినిమా ఖడ్గం. పాకిస్తాన్, టెర్రరిజం, ఇండియన్స్ పవర్, ఇండియన్ పోలీస్ వ్యవస్థ, ఆర్మీ ధైర్య-సాహసాల గురించి..ఎన్నో గొప్ప విషయాలను కూడ్చి దర్శకుడు కృష్ణ వంశీ తీసిన అద్భుతమైన చిత్రం. ప్రతీ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను స్మాల్ స్క్రీన్‌పై ప్రదర్శిస్తున్నారంటే ఖడ్గం ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, శివాజీ రాజా, సోనాలి బింద్రే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కమల్ 'భారతీయుడు':

శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. లంచం అనే అంశం, భారతీయుల గొప్పతనం గురించి ఎంతో గొప్పగా చెప్పిన సినిమా ఇది. తప్పు చేస్తే కన్న కొడుకును కూడా చంపేసే పాత్రలో కమల్ నటన అద్భుతం. కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేక కన్న కూతురును పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత సొసైటీపై తిరగబడతాడు. ఈ సినిమా ఇతర దేశాలకి ఇన్స్పిరేషన్.
మేచర్ చంద్రకాంత్, బొబ్బిలి పులి, అడవి శేష్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన మేజర్ చిత్రం, చిరంజీవి నటించిన ముఠా మేస్త్రి, నాగార్జున నటించిన ఆజాద్, శ్రీకాంత్ నటించిన మహాత్మ..ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. అలాంటి, వాటిలో వెంకటేష్ నటించిన శుభాష్ చంద్రబోస్, కమల్ నటించిన 'భారతీయుడు 2' కూడా ఉన్నాయి.


