సినిమా

Sharwanand: ఆగస్టులో భోగి లేనట్టే..రానట్టే!

రచన: Anshu•••3 నిమిషాల పఠనం

Sharwanand: శర్వానంద్ హీరోగా ఒక సినిమా సెట్స్‌పై ఉంది. ఒక సినిమా తాజాగా ప్రారంభమైంది. అయితే, కొత్త సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. డిస్ట్రిబ్యూషన్ కూడా పూర్తైంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న జార్జ్ క్రిష్ ఆ సినిమా. శర్వా కెరీర్‌లో ఓ మంచి సినిమాగా ఇది నిలుస్తుందని చెప్తున్నారు. 2027, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ కాబోతోంది.

అయితే, సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న భోగి సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ఇంతవరకూ క్లారిటీ లేదు. ఈ సినిమా మొదలై కూడా చాలా నెలలవుతోంది. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. వాస్తవానికి, భోగి సినిమాను ఈ ఆగస్టు 28న రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు.

కానీ, ఇప్పుడు షూటింగ్ దశలోనే ఈ సినిమా ఉంది. ఇటీవలే 22 రోజుల లాంగ్ షెడ్యూల్ పూర్తి చేసినట్టుగా సంపత్ నంది టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. 1960 కాలం నాటి పీరియాడికల్ డ్రామాగా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. కంటెంట్ పరంగా చాలా బలమైన ఎమోషన్స్‌తో కూడుకున్నదని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

కానీ, ఇప్పుడు రిలీజ్ విషయంలోనే మేకర్స్ నుంచి అసలు క్లారిటీ రావడం లేదు. ఆల్రెడీ పెద్ద సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. సోలో డేట్ దొరకాలన్నా, వారం రోజులు ఏ సినిమా పోటీ లేకుండా ఉండాలన్నా ముందు ప్రకటించిన తేదీనే కరెక్ట్. కానీ, ప్రస్తుతం భోగి సినిమా పరిస్థితి చూస్తుంటే ఆగస్టు 28కి వచ్చే సూచనలేవీ కనిపించడం లేదు. గ్యారెంటీగా రిలీజ్ డేట్ మారే అవకాశాలైతే ఉన్నాయి. దానిపై మేకర్స్ ఎప్పుడు స్పష్టత వస్తుందో మరి.

#bhogi#sharwanand#sampathnandi#anupamaparameshwaran#dimplehayathi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి