సినిమా

Tollywood: ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో దెబ్బైపోతున్న స్టార్ డైరెక్టర్స్

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Tollywood: బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా హిట్ సాధించినా, ఫ్లాప్ మూటగట్టుకున్నా చివరికి ఆ క్రెడిట్ మోయాల్సింది దర్శకుడే. సినిమా హిట్, ఫ్లాప్ గురించి ఎవరూ అంచనా వేయలేరు. పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా ఏ సినిమా ఎందుకు హిట్టౌవుతుందో ఎవరికీ తెలీదు. ఇండస్ట్రీ హిట్ లాంటి పోకిరి కూడా ఎందుకు అంత పెద్ద హిట్టైందో తెలియదన్నాడు పూరి.

Tollywood: బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా హిట్ సాధించినా, ఫ్లాప్ మూటగట్టుకున్నా చివరికి ఆ క్రెడిట్ మోయాల్సింది దర్శకుడే. సినిమా హిట్, ఫ్లాప్ గురించి ఎవరూ అంచనా వేయలేరు. పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు చెప్పినట్టుగా ఏ సినిమా ఎందుకు హిట్టౌవుతుందో ఎవరికీ తెలీదు. ఇండస్ట్రీ హిట్ లాంటి పోకిరి కూడా ఎందుకు అంత పెద్ద హిట్టైందో తెలియదన్నాడు పూరి.

నిజంగా ఇది జన్యూన్ ఆన్సరే. కొన్ని సందర్భాలలో మంచి హిట్ అవుతుందనుకున్న సినిమా డిజాస్టర్ అయింది. ఇది ఆడదు అనుకున్న సినిమా బాక్సులు బద్ధలు కొట్టింది. ఉదాహరణకి బాహుబలి సినిమా పార్ట్ 1 తీసుకుంటే ముందుగా ఈ సినిమాకి వచ్చింది నెగిటివ్ టాకే. కానీ, ఫస్ట్ వీక్ తర్వాత ఎందుకు పీక్స్‌కెళ్ళిందో తెలియదు. ఫలితం, ఊహించని కలెక్షన్. కానీ, ఇప్పటికీ చాలామంది ఈ సినిమా ఎందుకు ఆడిందంటే సరైన సమాధానం లేదు.

ఇక, విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమాను డబ్బింగ్ రైట్స్ కొనడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు. కానీ, ఈ సినిమా తెలుగులో సాధించిన వసూళ్ళు చూస్తే ఇప్పటికీ షాకే. అయితే, ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు, ఆ సినిమాలను తీసిన దర్శకులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీకి కారణమయ్యాయి. ఉదాహరణకి మారుతి. ఆయన, చేసిన కామెంట్స్‌కి ఏదో ఊహించుకున్నారు.

రాజు వెడ్స్ రాంబాయి సినిమా దర్శకుడు..ఈ సినిమా హిట్ కాకపోతే అమీర్ పేట్ సెంటర్‌లో షర్ట్ విప్పి తిరుగుతా అన్నాడు. కానీ, ఆ అవసరం రాలేదు. సినిమా ఏ రేంజ్ హిట్టో అందరికీ తెలిసిందే. ఇలాంటి కామెంటే ది రాజాసాబ్ విషయంలో దర్శకుడు మారుతి కూడా చేశాడు. ఈ సినిమా గనక ఫ్లాపైతే నా ఇంటికి వచ్చి అడగొచ్చు అంటూ ఏకంగా ఇంటి అడ్రస్ కూడా ఇచ్చాడు. అలా, అన్నప్పుడే చాలామంది అన్నారు..ఇదేదో తేడా కొట్టే విషయమే అని. అన్నట్టుగానే రాజాసాబ్ ఫలితం తేడా కొట్టింది.

అప్పటి నుంచి మారుతిని ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య శ్రీనివాసమంగాపురం దర్శకుడు అజయ్ భూపతి కూడా ఇలాంటి కామెంట్స్ చేసి చివరికి ఫ్లాప్‌ని ఒప్పుకోక తప్పలేదు. మరి, వీరందరికీ ఎందుకింత ఓవర్ కాన్‌ఫిడెన్స్. ప్రేక్షకులకి నచ్చితే వాళ్ళే సినిమాను నెత్తిన పెట్టుకుంటారు. లేదంటే, ప్రమోషన్స్ కి ఎన్ని కోట్లు పెట్టినా ఒక్క పూట కూడా ఆడదు. ఈ లెక్కలు మన వాళ్ళకి తెలియా అనేది పెద్ద డౌట్.

#Tollywood#Maruthi#AjauBhupathi#Saeelu#SaiRajesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి