Priyamani: మన తెలుగు సీనియర్ హీరోలకి ఏజ్‌కి తగ్గ హీరోయిన్స్ దొరకడం లేదంటూ ఓ...తెగ చెప్పేస్తుంటారు. కానీ, సూటయ్యే హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కాకపోతే, ఇంకా మన సీనియర్ స్టార్ హీరోలు డాన్సులు, రొమాన్సులు చేస్తున్నారు కాబట్టి సీనియర్ హీరోయిన్స్ వంక చూడటం లేదు. కొందరు ఫాంలో ఉన్న హీరోయిన్స్ మీద మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు.
వారిలో, ఎక్కువగా అవకశాలు అందుకుంటుంది నయనతార. కానీ, చిరంజీవి..బాలకృష్ణ..నాగార్జున..వెంకటేష్ లాంటి వారి వయసుమళ్ళిన పాత్రలకి సరైన జోడీ అంటే మీనా, ప్రియమణి, అభిరామి, తమన్నా, వరలక్ష్మీ శరత్‌కుమార్, లయ, అనుష్క శెట్టి..ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. కానీ, ఫ్యాన్స్ అండ్ సినీ లవర్స్‌కి కొత్త వాటాలు కావాలి. మన హీరోలకి జంట కొత్తగా ఉంటే క్రేజ్ ఉంటుందనే భావన.
దర్శకనిర్మాతలకి కొత్త అమ్మాయి అయితే వ్యాపారం పరంగా కూడా కలిసి వస్తుంది. ఇలాంటి ఎన్నో లెక్కలు సీనియర్ హీరోయిన్స్‌ని పక్కన పెట్టడానికి కారణం అవుతున్నాయి. జాతీయ ఉత్తమనటిగా అవార్డ్ అందుకున్న ప్రియమణి లాంటి వారూ ఇప్పటికీ మంచి అందం, ఫిజిక్‌ని మేయిన్‌టైన్ చేస్తున్నారు. ఒకవైపు వెబ్ సిరీస్..ఇంకోవైపు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ టీవీ షోస్ తో బిజీగా ఉంది.

కానీ, సినిమాల పరంగా మాత్రం ఆశించిన అవకాశాలు దక్కడం లేదు. ఇటీవల తమిళ హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అదేమంత పేరు తెచ్చింది లేదు. అయితే, మెగా 158 మూవీలో ప్రియమణి చిరుకి జంటగా నటించనుంది. అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఇది కన్‌ఫర్మ్ న్యూసే. నారప్ప, విరాటపర్వం తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. వాస్తవానికి, ప్రియమణి మన సీనియర్ హీరోలకి మంచి జోడీ. అందాల విందులోనూ వెనకాడదు. కానీ, ఎవరి కన్నూ ఈ డస్కీ బ్యూటీపై పడటం లేదు ఎందుకో.


