National

Indonesia: ఇండోనేషియాను వణికిస్తున్న ప్రకృతి.. భూకంపాలతో పాటు సునామీ!..

రచన: Venu••4 నిమిషాల పఠనం

ఇండోనేషియాలోని ఫ్లోరెస్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తీర ప్రాంతాలను వణికించాయి. ఫ్లోరెస్‌లోని ఎండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అంతర్జాతీయ భూకంప పరిశీలనా సంస్థలు వెల్లడించాయి.

ప్రకృతి విపత్తులతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చే వరదలు ఒకవైపు.. భూకంపాలు మరోవైపు.. ప్రజలను అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండోనేషియాలోని ఫ్లోరెస్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తీర ప్రాంతాలను వణికించాయి. ఫ్లోరెస్‌లోని ఎండే నగరానికి సుమారు 68 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అంతర్జాతీయ భూకంప పరిశీలనా సంస్థలు వెల్లడించాయి.

ప్రధాన ప్రకంపన తర్వాత నిమిషాల వ్యవధిలోనే వరుసగా ప్రకంపనలు, ఆఫ్టర్‌షాక్‌లు సంభవించినట్లు సమాచారం. భూకంపం ధాటికి ఫ్లోరెస్ తీర ప్రాంతంతో పాటు పరిసర పట్టణాల్లో భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు సముద్ర గర్భంలో తక్కువ లోతులోనే ఈ భూకంపం సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

సునామీ ముప్పు ఉన్న నేపథ్యంలో ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ BMKG తీర ప్రాంత ప్రజలకు ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆలస్యం చేయకుండా సురక్షితమైన, ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. కాగా భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు.. అవసరమైన సహాయక చర్యల కోసం రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు.

భూకంపం తర్వాత తీర ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సముద్ర అలల కదలికలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక ఇటీవల కొలంబియాలో సంభవించిన భూకంపం వల్ల 225 మందికి పైగా మరణించిన నేపథ్యంలో.. ఇండోనేషియాలో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో అధికారులు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ముందస్తు రక్షణ చర్యలను వేగవంతం చేశారు.

#National News#EarthQuake#Indonesia#tsunami#Flores
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి