తెలంగాణ

Kodad: స్వాతంత్య్ర వేడుకల్లో ఊహించని ట్విస్ట్.. పెట్రోల్‌తో మహిళ హల్‌చల్!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

పులి రత్తమ్మ తన ఉద్యోగ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం సమర్పించారు. తమకు ఉద్యోగాలు కల్పించిన తర్వాత తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సమస్యపై వెంటనే స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రత్తమ్మ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించారు.

కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ మహిళ తమ జీవనాధారమైన ఉద్యోగాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. తల్లి సమస్యకు న్యాయం చేయాలంటూ ఆమె కూతురు కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ మున్సిపాలిటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి రత్తమ్మ తన ఉద్యోగ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం సమర్పించారు. తమకు ఉద్యోగాలు కల్పించిన తర్వాత తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సమస్యపై వెంటనే స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రత్తమ్మ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించారు.

అప్రమత్తమైన పోలీసులు, అక్కడున్న వారు ఆమెను అడ్డుకుని, 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక రత్తమ్మ కూతురు పులి జ్యోతి కూడా తల్లి సమస్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఉద్యోగాలు కోల్పోవడంతో తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, తమ జీవనాధారమైన ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని ఆమె కోరారు.

ఇక పేద కుటుంబాలకు ఉద్యోగమే జీవనాధారం. ఆ ఉద్యోగం పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ సమస్యను అధికారులు సున్నితంగా, మానవతా దృక్పథంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. సమస్యకు పరిష్కారం దొరకక ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి రావడం ఆందోళన కలిగించే అంశం.

ఇలాంటి సంఘటనలు పేదల జీవితాల్లో ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో చెప్పకనే చెబుతున్నాయి. అంతేకాదు.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద పేదలు తమ సమస్యల కోసం తిరుగుతూ చివరకు ఇలాంటి ఘోరమైన నిర్ణయాలకు వెళ్లే పరిస్థితులు ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు తెస్తాయి. మరోవైపు కార్మికుల ఆరోపణలను మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఖండించినట్లు సమాచారం. ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించిన అంశాల్లో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కాబట్టి తల్లీకూతుళ్ల సమస్యపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలి. దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఎన్ఎంఆర్ కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం చూపాలి.. మరోవైపు ఈ అంశంలో ప్రభుత్వం, అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

#Telangana#Kodad#Independence Day#Woman#petrol#MLA Padmavathi Reddy
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి