తెలంగాణ

తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్.. బండి సంజయ్ తీవ్ర విమర్శలు!

రచన: Mamatha puppala••6 నిమిషాల పఠనం

తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని భూముల నిర్వహణపై బండి సంజయ్ పలు ప్రశ్నలు గుప్పించారు.

తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని భూముల నిర్వహణపై బండి సంజయ్ పలు ప్రశ్నలు గుప్పించారు.

కొత్తగా పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటూ, అసలు బియ్యం ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఎందుకు పెట్టలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కేవలం ఒక తుమ్ముకే ఊడిపోయేంత బలహీనమైన పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే అందిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ‘సొమ్ము ఒకరిది.. సోకొకరిది’ అన్న చందంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు.

22ఏ పేరుతో భారీ దోపిడీ

తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత భూముల చట్టం (22ఏ) పేరుతో తీవ్ర అన్యాయం, భారీ స్థాయిలో అక్రమాలు సాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో పరిపాలించిన భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య ఎలాంటి వ్యత్యాసమూ లేదని, ప్రజలను వేధించడంలో రెండు పార్టీలు ఒకే బాటలో పయనిస్తున్నాయని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2.77 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో, ఏకంగా 95 లక్షల ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితాలోకి ఏ విధంగా చేరుస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సామాన్య ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసుకున్న ప్లాట్లు, పరిశ్రమల స్థాపనకు కేటాయించిన స్థలాలు, చివరకు గతంలో ప్రభుత్వమే స్వయంగా వేలం వేసి విక్రయించిన భూములను కూడా ఈ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని ఆక్షేపించారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినడమే కాకుండా, సామాన్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కూడా బండి సంజయ్ తప్పుపట్టారు. విద్యాసంస్థలకు చెల్లించాల్సిన పాత ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా పెండింగ్‌లో పెట్టి, రాబోయే విద్యాసంవత్సరం నుంచి ముందస్తుగా (అడ్వాన్స్) ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే రాజకీయ ప్రకటనలపై స్పందిస్తూ, జెన్-జీ (Gen-Z) నవతరం యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్న కాంగ్రెస్ మాటలు నిజమే అయితే, ఆ మాటలకు కట్టుబడి ఉండాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు యువతపై నిజమైన ప్రేమ ఉంటే వెంటనే వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు, ఎమ్మెల్సీ సీట్లు కేటాయించి తమ కట్టుబాటును నిరూపించుకోవాలని సూచించారు.

వందే మాతరాన్ని అవమానించే వారంతా దేశ ద్రోహులే..

మరొకవైపు జాతీయ గేయం ‘వందేమాతరం’ ప్రాధాన్యతను పునరుద్ఘాటిస్తూ.. వందేమాతరాన్ని అవమానించే ప్రతి ఒక్కరూ దేశద్రోహులేనని బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో అసెంబ్లీలో వందేమాతర గీతాలపనను ఎంఐఎం పార్టీ బహిష్కరిస్తే, కాంగ్రెస్ పార్టీ దానికి పూర్తి స్థాయిలో వత్తాసు పలికిందని ఆరోపించారు. త్వరలోనే పాతబస్తీలోని ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద లక్షలాది మందితో కలిసి అంగరంగ వైభవంగా వందేమాతరం గీతాలపన చేయిస్తానని స్పష్టం చేశారు. ఎంఐఎం నేతలకు దమ్ముంటే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటూ సవాల్ విసిరారు.

#Bandi Sanjay Press Meet BJP Office Nampalli#22A Prohibited Lands Telangana Row#Telangana Land Scam Bandi Sanjay Allegations#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి