తెలంగాణ

Ktr: దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోంది.. సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి-కేటీఆర్

రచన: NK••7 నిమిషాల పఠనం

దేశ పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. పాలకులకు దేశంపై సరైన అవగాహన లేదని విమర్శించారు. మతం మత్తులో పడి దేశం వెనక్కి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్న కేటీఆర్.. దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం అని చెప్పారు. మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నారు. వారికి భవిష్యత్తు ఉండాలంటే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.

Ktr: దేశ పరిస్థితులు చూస్తుంటే బాధేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. పాలకులకు దేశంపై సరైన అవగాహన లేదని విమర్శించారు. మతం మత్తులో పడి దేశం వెనక్కి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం అన్న కేటీఆర్.. దేశం శాశ్వతం, రాష్ట్రం శాశ్వతం అని చెప్పారు. మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నారు. వారికి భవిష్యత్తు ఉండాలంటే సరైన నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.

అదానీ కుటుంబం కంటే పెద్దది ఎలా చేయాలి?

సీఎం రేవంత్ పాలనపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు వింటే నాకు నవ్వు వచ్చింది, చాలా ఆశ్చర్యం అనిపించిందని అన్నారు. ''నేను 18 గంటలు పని చేస్తున్నా, కాబట్టి నన్నే గెలిపించండి అని రేవంత్ అంటున్నారు. కొండల్ రెడ్డి కొండలు ఎలా కొల్లగొట్టాలి, భూములు గుంజుకుని తిరుపతి రెడ్డికి ఎలా ఇయ్యాలి, అల్లుడికి ఆస్తులు ఎలా ఇయ్యాలి, మొత్తం కుటుంబాన్ని అదానీ కుటుంబం కంటే పెద్దది ఎలా చేయాలి? అదే అజెండాతో రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. అంతకుమించి ఏం చేస్తున్నారు?'' అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

తులం బంగారం ఇస్తానని మోసం..

కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం రేవంత్ మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు తీర్పుపై కౌంటర్ వేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 15 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశారని, 14 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు.

''కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆడబిడ్డలకు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నారు. నన్ను గెలిపించండి. లక్ష మాత్రమే కాదు తులం బంగారం ఇస్తానని రేవంత్ అన్నారు. అలా చెప్పిన వ్యక్తి ఇవాళ ఉన్న స్కీమ్స్ కూడా ఊడగొట్టారు. హైకోర్టులో కౌంటర్ వేయడానికి టైమ్ లేదట ముఖ్యమంత్రికి. ఉన్న స్కీములు ఊడగొట్టారు. కల్యాణ లక్ష్మి ఊడగొట్టారు. రైతు భీమా, కేసీఆర్ కిట్లు ఊడగొట్టారు. కొత్త స్కీమ్ లు తెస్తారని అనుకుంటే ఉన్నవి కూడా ఊడగొట్టారు. ఇంత ఘోరమా? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నికలు రాగానే చిన్న చిన్న కోపాలు, తాపాలతో ఆగమాగం అయితే ఐదేళ్లు ఇబ్బంది పడతారు.

యూరియా కోసం అడుక్కునే పరిస్థితి..

కేసీఆర్ చెప్పారు.. మోసపోకండి.. మోసపోతే గోసపడతరు. ఇవాళ అదే జరుగుతోంది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్లు పట్టుకుంటున్నారు. మా హయాంలో ఫోన్ చేస్తే చాలు పొలం దగ్గరికి వచ్చి యూరియా వేసి వెళ్తుండే. యూరియా కావాలంటే చివరికి నాయకులు కూడా లైన్ లో నిలబడి అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఒక రైతు వీఆర్వో కాళ్లు పట్టుకోవడం బాధాకరం. దేశంలో ఇవాళ ఇలాంటి పరిస్థితి ఉంది. దేశం బాగుపడాలి అని అనుకున్నప్పుడు ఆ పని మన ఇంట్లో నుంచే మొదలుకావాలి. కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి.

జాతి నిర్మాణంలో తెలంగాణ పాత్ర చాలా పెద్దది. భారత దేశం జీడీపీలో తెలంగాణ కాంట్రిబ్యూషన్ 5.2శాతం. జాతి నిర్మాణంలో దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి నాయకత్వ పటిమ ఇక్కడ ఉండేది. ఇవాళ ఉండే నాయకులకు తెలివి లేక దివాళా తీసిన రాష్ట్రం అని దివాళకోరు మాటలు మాట్లాడుతున్నారు.

దేశానికే బువ్వ పెడుతున్న రాష్ట్రం తెలంగాణ..

దేశానికే బువ్వ పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. అలాంటి తెలంగాణను తిరిగి పట్టాలు ఎక్కించాలంటే మళ్లీ నాయకత్వం కావాలి. సమర్థత ఉన్న నాయకుడు రావాలి. తెలంగాణను ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించే నాయకుడు మన కేసీఆర్ మాత్రమే. అలాంటి నాయకుడిని మనం తిరిగి తెచ్చుకోవాలి. రాబోయే రెండేళ్లు గట్టిగా పని చేయాలి. జిల్లాలు, నియోజకవర్గాల్లో ఇంకా యాక్టివిటీ పెంచుదాం. ప్రతి రోజు కార్యక్రమాలు ఉండే విధంగా ప్లాన్ చేసుకుందాం. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుందాం'' అని కేటీఆర్ అన్నారు.

#Ktr#Brs#Hyderabad#Telangana#Cm Revanth Reddy#Swechaa News#Bjp
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి