National

AI Skill Training: యువతకు మోదీ గుడ్‌న్యూస్.. కోటి మందికి ఫ్రీ..!!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు పలు కీలక ప్రకటనలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తియే అత్యంత కీలకమైన చోదక శక్తి అని అభివర్ణించిన ఆయన, రాబోయే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కోటి మంది యువతకు కృత్రిమ మేధ (AI)లో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు.

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ యువతకు పలు కీలక ప్రకటనలు చేశారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువశక్తియే అత్యంత కీలకమైన చోదక శక్తి అని అభివర్ణించిన ఆయన, రాబోయే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా ఏఐ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కోటి మంది యువతకు కృత్రిమ మేధ (AI)లో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల ఏఐ రంగంలో ప్రపంచానికే నాయకత్వం వహించే సామర్థ్యం భారతీయ యువతకు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై కోచింగ్ సెంటర్ల ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ప్రతిభావంతులైన ఉపాధ్యాయుల భాగస్వామ్యంతో ఈ నెట్‌వర్క్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు మారుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పౌర రక్షణ (సివిల్ డిఫెన్స్) వ్యవస్థను ఆధునిక శిక్షణతో బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.

క్రీడారంగంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు 5 నుంచి 15 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలలో క్రీడా స్ఫూర్తిని నింపేలా గ్రామాలు, నగరాల్లో విస్తృతమైన టాలెంట్ హంట్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. సాంకేతిక రంగంలో ‘ఆత్మనిర్భరత’ సాధించడంలో భాగంగా రాబోయే 1–2 ఏళ్లలో 7 నుంచి 8 కొత్త సెమీకండక్టర్ తయారీ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎనర్జీ రంగంలో 2047 నాటికి 100 గిగావాట్ల (GW) అణు విద్యుత్ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో రాబోయే 6-7 ఏళ్లలో 5 కొత్త న్యూక్లియర్ రియాక్టర్లను అందుబాటులోకి తేనున్నట్లు పంద్రాగస్టు ప్రసంగంలో ప్రకటించారు.

 

#PM Modi Independence Day 2026 Speech#AI Skill Training 1 Crore Youth#Free Online Coaching Competitive Exams#Semiconductor Plants India#Civil Defence Reforms#Viksit Bharat 2047#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి