Pawan Kalyan-Ram Charan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత చిత్రం 'ఓజీ'. ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించాడు. ఎస్.ఎస్.థమన్ సంగీతమందించాడు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఓజీ భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. అంతకముందు వచ్చిన 'హరిహర వీరమల్లు' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా, ఆ ప్రభావం 'ఓజీ'పై పడలేదు. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల భారీ గ్రాసర్‌గా ఈ చిత్రం నిలిచింది.
ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని సుజీత్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కథ పట్ల ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భగా 'ఓజీ 2' షూటింగ్ అప్‌డేట్ ఉండబోతోంది. అయితే, ఫిల్మ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్నదాని ప్రకారం నవంబర్ నుంచి 'ఓజీ 2' షూటింగ్ మొదలవనుందట.
అయితే, నవంబర్‌లో ఒక్క 'ఓజీ 2' మాత్రమే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోతున్న 'ఆర్సీ 17' కూడా ఘనంగా పూజా కార్యక్రమాలతో మొదలై, వెంటనే చిత్రీకరణ కూడా ప్రారంభించేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సుక్కూ, చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' పెద్ద కమర్షియల్ సక్సెస్‌ను సాధించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మళ్ళీ, ఇదే కాంబోలో సినిమా అనగానే అంచనాలు రెట్టింపైయ్యాయి. ఇక, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అయితే, ఆల్రెడీ నవంబర్ నుంచి ఓజీ మొదలవనుండగా, ఇటు చరణ్-సుకుమార్ కూడా ఇదే నెలలో సెట్స్ మీదకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తుండటంతో, మెగా అభిమానుల్లో సంతోషం మొదలైంది. ఒకే, నెలలో మొదలయ్యే మెగా హీరోల సినిమాలు, ఇంచుమించు ఒకేసారి రిలీజ్ కూడా అవ్వొచ్చునని ప్రచారం మొదలైంది.


